ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 12:54 PM IST

Updated : Jan 14, 2024, 6:42 AM IST

Nara Lokesh Tour in Mangalagiri: మంగళగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.

TDP_Leader_Nara_Lokesh_Tour_in_Mangalagiri
TDP_Leader_Nara_Lokesh_Tour_in_Mangalagiri

మంగళగిరి పర్యటనలో రాష్ట్ర ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

TDP Leader Nara Lokesh Tour in Mangalagiri :రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విభిన్న కుల, మతాల సమాహారంగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో నారా లోకేశ్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. దుగ్గిరాల, మంగళగిరి మండలాల్లోని తటస్థులతో లోకేశ్ సమావేశం అయ్యారు.

Nara Lokesh Today Schedule :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో ప్రముఖులను ఇళ్లకు వెళ్లి కలుస్తూ తమ ఆలోచనలను వివరించి, వారి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు నారా లోకేశ్. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులోని చెంచు సామాజికవర్గ పెద్ద తిరుపతయ్య కుటుంబసభ్యులు లోకేశ్​ను సాదరంగా ఆహ్వానించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టడం, చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారని, సంచార జాతిగా ఉన్న తమ సామాజిక వర్గీయులకు ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

మంగళగిరిలో లోకేశ్ పర్యటన - తటస్థులతో యువనేత భేటీ

లోకేశ్​ దృష్టికి చేనేత వృత్తి సమస్యలు : వారి సమస్యలు విన్న రాబోయే 3 నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తోందని, చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి లంబాడీ సామాజికవర్గ ప్రముఖులు జరపాల సాంబశివరావును ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకుని, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మంగళగిరిలోని ప్రముఖ చేనేత వ్యాపారి వెనిగళ్ల శంకర్రావు, కొల్లి శ్రీనివాస్​లను కలుసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన చేనేత సామాజిక వర్గీయులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.

ఖిద్మత్ టీమ్​ను అభినందించిన యువనేత : ప్రముఖ స్వచ్చంద సంస్థ ఖిద్మత్ టీమ్ సభ్యులను లోకేశ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కోవిడ్ సమయంలో తమ సంస్థ తరఫున అనాథలు, పేదలకు విశేష సేవలందించామని సంస్థ అధినేత షేక్ షఫి లోకేశ్​కు వివరించారు. మంగళగిరిలో విశేష సేవలందిస్తున్న ఖిద్మత్ టీమ్​ను యువనేత అభినందించారు.

"యువతను ఉత్తమ క్రీడాకారులుగా మార్చేందుకు లోకేశ్​ కృషి"

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్​ :భోగ‌భాగ్యాల భోగి, స‌క‌ల శుభాల సంక్రాంతి, క‌న్నుల పండువ‌గా క‌నుమ పండ‌గ‌లు జ‌రుపుకుంటోన్న తెలుగు ప్రజ‌ల‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రస‌రించాలని, సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకురావ‌డ‌మే తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంక‌ల్పమని లోకేష్‌ పేర్కొన్నారు.

అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది?: లోకేశ్

Last Updated : Jan 14, 2024, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details