"యువతను ఉత్తమ క్రీడాకారులుగా మార్చేందుకు లోకేశ్​ కృషి"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 1:56 PM IST

thumbnail

Mangalagiri Premium Cricket League: గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ కృషి చేస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. లోకేశ్​ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరిలోని నారా లోకేశ్​ క్రీడా మైదానంలో, మంగళగిరి ప్రీమియం క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్​. ఎస్​ రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, నజీర్ అహ్మద్ ప్రారంభించారు.ఈ రోజు నుంచి 28తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో 100 జట్లు పాల్గొననున్నాయని వివరించారు. ఈ పోటీల ద్వారా మొదటి విజేతకు రెండు లక్షలు, రన్నరప్​కు లక్ష, మూడో స్థానంలో నిలిచిన జట్టుకి 50 వేల రూపాయల బహుమతిని అందించనున్నారు. 

వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వ హయంలో యువత గంజాయికి బానిసవుతుంటే, వారిని సరైన మార్గంలో నడిపించేందుకు లోకేశ్​ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీలు చూసైనా అధికార పార్టీ నాయకులు క్రీడలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలన్నారు. ఆడుదాం ఆంధ్రా పోటీలు క్రీడాకారులు లేక వెలవెలబోతున్నాయని వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.