ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్బీకేలో అక్రమాలు.. గంజాయి కేసుల్లో పెద్ద తలకాయలు: నాదెండ్ల మనోహర్

By

Published : Nov 2, 2022, 7:18 PM IST

Rythu Bharosa centres in ap: రైతుభరోసా కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 10వేల 700 ఆర్బీకేల్లో అవినీతి జరుగుతున్నట్లు విజిలెన్స్ నివేదిక చెప్పిందని తెలిపారు. గంజాయి కేసుల్లో పెద్ద తలకాయల్ని వదిలి.. చిన్నవాళ్లను మాత్రమే అరెస్టు చేస్తున్నారని మనోహర్ అన్నారు.

Nadendla Manohar
జనసేన నేత నాదెండ్ల మనోహర్

Rythu Bharosa centres: రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో అతిపెద్ద స్కాం అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల దగ్గర లంచాలు తీసుకున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పంట నష్టం జరిగిన రైతులు ఆర్బీకేల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారని మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని,.. తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 10వేల 700 ఆర్బీకేల్లో అవినీతి జరుగుతున్నట్లు విజిలెన్స్ నివేదిక చెప్పిందన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే రైతులను సైతం కులాలవారీగా గుర్తిస్తున్నారని విమర్శించారు. గంజాయి కేసుల్లో పెద్ద తలకాయల్ని వదిలి చిన్నవాళ్లను మాత్రమే అరెస్టు చేస్తున్నారని మనోహర్ అన్నారు. గతంలో ఉన్న డీజీపీ గంజాయి నిర్మూలన చేస్తున్నందుకే తొలగించారని ఆరోపించారు.

జనసేన నేత నాదెండ్ల మనోహర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details