ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా మృతురాలు ఎన్నికల్లో గెలిచింది..

By

Published : Sep 19, 2021, 6:53 PM IST

Updated : Sep 19, 2021, 7:12 PM IST

గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లా వార్తలు ()

ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన దొంతిబోయిన ఝాన్సీ లక్ష్మీ కరోనా కారణంగా మృతి (mptc winning candidate died) చెందింది. అయితే తాజాగా జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె.. తన ప్రత్యర్థిపై 134 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె బ్రతికి ఉంటే ఎంపీపీ అయ్యేవారని.. స్థానికులు చెబుతున్నారు.

ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచి ఎంపీపీ కావాలన్న ఆ మహిళ ఆకాంక్షను కరోనా బలి తీసుకుంది. అయితే ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం ఆమె విజయం (mptc winning candidate died) సాధించారు. గుంటూరు జిల్లా కర్లపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి వైకాపా తరపున దొంతిబోయిన ఝాన్షి లక్ష్మి పోటీ చేశారు. కర్లపాలెం ఎంపీపీ పదవి కూడా ఆమెకే దక్కుతుందని అంతా భావించారు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో కరోనాతో ఆమె మరణించారు. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో ఝాన్సీ లక్ష్మీ 134 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమెను గుర్తు చేసుకుని విషాదంలో మునిగారు.

ఇదీ చదవండి:ACHENNA : 'ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేసింది'

Last Updated :Sep 19, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details