ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Liquor Sales in AP: 'ఏపీలో తగ్గిన మద్యం అమ్మకాలు'.. ఆదాయం ఎలా పెరిగింది జగనన్న..?

By

Published : Jul 19, 2023, 8:53 AM IST

Liquor Sales and Income in AP: రాష్ట్రంలో గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే మద్యం విక్రయాలు తగ్గాయని విచిత్రమైన వాదనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విక్రయాలు తగ్గితే ఆదాయం ఎలా పెరిగిందన్న అంశాన్ని మాత్రం వివరించటం లేదు.

Liquor Sales
మద్యం అమ్మకాలు

మద్యం అమ్మకాలు

Liquor Sales and Income in AP: దశలవారీ సంపూర్ణ మధ్య నిషేధం అని ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం తాగించి ఆదాయాన్ని పెంచుకోవడంలో ఆరితేరిపోయింది. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే మద్యం విక్రయాలు విచిత్రమైన వాదనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు తగ్గితే ఆదాయం ఎలా పెరిగిందన్న అంశాన్ని మాత్రం వివరించటం లేదు. ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలోనే రాష్ట్రంలోని మద్యం విక్రయాలపై వాస్తవాలను దాచి గణాంకాలను బయటపెట్టిన పరిస్థితి.

సాధారణంగా ఏ ప్రభుత్వమైనా గత ఏడాదితో పోల్చుకోవటం పరిపాటి అయితే వైఎస్సార్​సీపీ ప్రభుత్వం మాత్రం నాలుగేళ్ల కిందటి గణాంకాలను ప్రస్తుత ఏడాదితో పోల్చి విచిత్రమైన వాదన చేస్తోంది. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో గణాంకాలను చెప్పుకొచ్చారు. 2018–19తో పోలిస్తే ఈ ఏడాదిలో మద్యం అమ్మకాలు 384.36 లక్షల కేసులు జరిగాయని అబ్కారీ శాఖ వివరించింది. 2022–23లో 335.98 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగినట్టు చెప్పుకొచ్చింది.

2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు ఉంటే, 2022–23లో 116.76 లక్షల కేసులు మాత్రమే విక్రయించినట్టు వెల్లడించింది. 2018–19 ఏప్రిల్, మే, జూన్‌ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్‌ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్‌ 56.51 శాతంగా, తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని అబ్కారీ శాఖ చెప్పుకొచ్చింది. లిక్కర్‌ అమ్మకాల్లో మైనస్‌ 5.28 శాతంగా, తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దశలవారీ మద్య నిషేదం అమలు చేస్తామని.. ప్రతి ఏడాది 10 శాతం మేర మద్యం దుకాణాలు తగ్గిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.

నిషేధం లేక నియంత్రణ అసలు అమలుకాక మద్యం ఏరులై పారుతోంది. దశలవారీ సంపూర్ణ మద్య నిషేధం అమలు కావాల్సిన 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచే ఎడతెగని అమ్మకాలు జరిగాయి. కరోనా కారణంగా స్వల్పంగా విక్రయాలు తగ్గినా తదుపరి ఏడాది నుంచి మద్యప్రవాహం జోరందుకుంది. గడచిన నాలుగేళ్లలో 1,095 లక్షల కేసుల మద్యం విక్రయాలు రాష్ట్రంలో జరిగాయని స్వయంగా ఏపీ బెవరేజ్ కార్పోరేషన్ లిమిటెడ్ గణాంకాలే చెబుతున్నాయి. అలాగే 468.25 లక్షల బీర్లు కూడా విక్రయించినట్టు స్పష్టమవుతోంది. మొత్తంగా 2019-20 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్య మద్యం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయమే రూ.94,234 కోట్లుగా నమోదైంది.

వాస్తవానికి 2019-20లో 308.53 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. కరోనా కారణంగా 2020-21, 2021-22 సంవత్సరాల్లో విక్రయాలు కొద్దిగా మందగించినా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 335 లక్షల కేసుల మద్యం విక్రయించారు. 2019-20లో మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20,909 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక ఆ తదుపరి ఏడాదిలో 2020-19లో రూ.20,189 కోట్లు, 2021-22లో రూ.25,023 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.28,113 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా నాలుగేళ్ల కాలంలో కేవలం మద్యం విక్రయాల ద్వారానే రూ.92,234 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించింది.

ABOUT THE AUTHOR

...view details