ETV Bharat / city

సర్కారు మద్యం దుకాణాల్లో నిబంధనలకు పాతర

author img

By

Published : Oct 9, 2019, 1:05 AM IST

రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో కొన్ని చోట్ల నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ ఆదేశాలను గాలికొదిలేసి విక్రయాలు జరుపుతున్నారు నిర్వాహకులు.

మద్యం

సర్కార్ మద్యం దుకాణాల్లో నిబంధనలకు పాతర

విజయవాడ నగర శివారు ప్రాంతాలైన నున్న, కండ్రిక ప్రాంతాల్లో మద్యం దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకే మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పదిగంటల వరకు విక్రయాలు జరుపుతున్నారు‌. అంతేగాక షాపు దగ్గర మద్యం సేవించటానికి అనుమతి లేనప్పటికీ మందుబాబులు అక్కడే తాగుతున్నారు. దీనిపై స్పందించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి కొత్త మద్యం నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Intro:AP_cdp_47_07_mahila_Atmahatya_Av_Ap10043
K.veerachari, 9948047582
కడప జిల్లా పుల్లంపేట లో గ్రామ మహిళా వాలంటరీ రమాదేవి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఖ్యం భర్త ఒక పాప ఉంది. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దసరా పండుగకు కొత్త దుస్తులు కూడా తెచ్చుకున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు గానీ ఆమె ఉరి వేసుకోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.Body:గ్రామ మహిళ వాలంటరి ఆత్మహత్యConclusion:కడప జిల్లా పుల్లంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.