ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ దోపిడీలను ప్రశ్నించినందుకే మహాసేన రాజేష్​పై దాడి: పవన్​కల్యాణ్​

By

Published : Jan 3, 2023, 3:11 PM IST

Pawan Kalyan called to Mahasena Rajesh: అధికార పార్టీ దోపిడీలు, దాష్టీకాలను ప్రశ్నిస్తున్న గొంతును నిలువరించే ప్రయత్నంలోనే మహాసేన రాజేష్​పై దాడి చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో దాడి అప్రజాస్వామికమని అన్నారు. మహాసేన రాజేష్​కు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

pawan kalyan
పవన్ కల్యాణ్

Pawan Kalyan called Mahasena Rajesh: రాజమహేంద్రవరంలో మహాసేన రాజేష్​పై జరిగిన దాడి అప్రజాస్వామికమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మహాసేన రాజేష్​కి పవన్ కల్యాణ్ ఫోన్ చేసి దాడి పూర్వాపరాలు తెలుసుకుని పరామర్శించారు. ప్రజా సమస్యలపై, పాలన వ్యవస్థలోని లోపాలపై స్పందిస్తున్న రాజేష్ తీరును జనసేనాని అభినందించారు. అధికార పార్టీ నాయకుల దోపిడీలు, దాష్టీకాలను ప్రశ్నిస్తున్న గొంతును నిలువరించే ప్రయత్నంలోనే.. అతనిపై దాడి చేశారని ఆరోపించారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా సాగుతున్న దాడులను.. ప్రజాస్వామ్య విధానాలపై విశ్వాసం ఉన్నవారు ఖండించాలన్నారు. గోదావరి జిల్లాల్లో హింసపూరిత వాతావరణాన్ని అధికార పార్టీ నాయకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

మహాసేన రాజేష్​కి ఫోన్ చేసి పరామర్శించిన పవన్ కల్యాణ్

ABOUT THE AUTHOR

...view details