ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jada Sravan Fires on YSRCP: జగన్‌ పాలనలో వ్యవస్థలు నాశనమవుతున్నాయి: జడ శ్రవణ్​కుమార్​

By

Published : Aug 2, 2023, 4:30 PM IST

Jada Sravan Kumar Fires on YSRCP: జగన్‌ పాలనలో వ్యవస్థలు నాశనమవుతున్నాయని జై భీమ్​ భారత్​ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. చంద్రన్న పెళ్లి కానుక సాయం పెంచుతామని జగన్‌ చెప్పారని.. కానీ వైఎస్సార్‌ పెళ్లికానుక అని పేరు మార్చారు తప్ప సాయం పెంచింది లేదన్నారు. ఎంతమందికి సాయం చేశారో చూస్తే ఆ సంఖ్య సున్నా అని విమర్శించారు.

Jada Sravan Kumar Fires on YSRCP
Jada Sravan Kumar Fires on YSRCP

Jada Sravan Kumar Fires on YSRCP: చరిత్ర చూడని వ్యక్తి సీఎం అయితే.. వ్యవస్థలు ఎలా నాశనం అయిపోతాయో ఈ పాలన చూస్తే అర్థం అవుతుందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. చంద్రన్న పెళ్లి కానుక ద్వారా 2018లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సాయం చేసే కార్యక్రమం మొదలుపెట్టారన్న ఆయన.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని మార్చి వైఎస్సార్ పెళ్లి కానుక అని పేరు మార్చారన్నారు. 2 ఏప్రిల్ 2020 నుంచి పెంచిన సాయం అమలులోకి వస్తుందని చెప్పారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి సాయం చేశారో చూస్తే ఆ సంఖ్య సున్నా అని విమర్శించారు.

రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల మందికి అన్యాయం జరుగుతుంటే.. గత మంత్రి విశ్వరూప్, ప్రస్తుత మంత్రులు మేరుగ నాగార్జున, విడుదల రజనీలు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ పిల్లలకు వారు ఏమి న్యాయం చేస్తున్నారని జడ శ్రవణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆన్​లైన్​లో అప్లై చేసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. పెళ్లి కానుక కింద డబ్బులు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని జడ శ్రవణ్‌ హామీ ఇచ్చారు. దశ యాప్ ద్వారా తమను సంప్రదించాలని.. జీవో ఇచ్చి పథకాలు అందించకపోతే వారి కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మంత్రికి దమ్ము ఉంటే వైఎస్సార్ పెళ్లి కానుక ఎందరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్​ చేేశారు.

జగనన్న విదేశీ విద్యా విధానం కింద ఎంతమందికి డబ్బులు ఇచ్చారని అనే దానిపై తమ దగ్గర లెక్కలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడినా వాళ్లని చంద్రబాబు మనిషి అనేస్తున్నారని,.. సీఎం జగన్​, మంత్రులు.. గట్టిగా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు కూడా మాట్లాడలేరని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం భవిష్యత్తులో రాదని అన్నారు. ఇక ఇప్పటి నుంచి ఏ మీటింగ్​లో అయినా చిన్నపిల్లాడు యూనిఫాంతో కనిపించినా అధికారులను కోర్టు ముందు నిలుపుతామని హెచ్చరించారు.

Jada Sravan on Margaddarsi: ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు ఈ రాష్ట్రంలో జరిగే వాస్తవాలపై మాట్లాడరని జడ శ్రవణ్​ నిలదీశారు. మార్గదర్శిపై అన్యాయంగా దాడి చేస్తున్నారని, సీఐడీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్గదర్శిపై యాడ్స్ ఇవ్వటం దారుణమని అన్నారు. 4 శాతం పోలవరం పనులు మాత్రమే 4 ఏళ్లలో ముందుకు తీసుకు వెళితే ఎందుకు మాట్లాడరని నిలదీశారు. ఒక గిరిజనుడు నోట్లో మూత్రం పోసినా.. ఇక్కడి మేధావులు మాట్లాడరని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details