ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాఫ్ట్‌వేర్ కంపెనీలకు టీఎస్ఆర్టీసీ బస్సులు.. యాజమాన్యాలతో భేటీ..!

By

Published : Nov 21, 2022, 4:10 PM IST

RTC Meeting with Software Companies: ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై రాష్ట్ర ఆర్టీసీ దృష్టిసారించింది. ప్రస్తుతం ఉన్న మార్గాల్లో బస్సులను నడపడంతో పాటు డిమాండ్ ఉన్న మార్గాలపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు బస్సులను నడిపిన ఆర్టీసీ, కొత్తగా ఆ కంపెనీలకే బస్సులను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక అద్దెలను సైతం నిర్ణయించింది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలకు టీఎస్ఆర్టీసీ బస్సులు
సాఫ్ట్‌వేర్ కంపెనీలకు టీఎస్ఆర్టీసీ బస్సులు

RTC Meeting with Software Companies: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌ ఆర్టీసీ అధికారులు.. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు బస్సులను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సికింద్రాబాద్, కూకట్‌పల్లి వంటి మార్గాల నుంచి.. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండే హైటెక్ సిటీకి ప్రత్యేక బస్సులు నడుపోంది. సుమారు 20కి పైగా సాఫ్ట్‌వేర్‌ సంస్థల ప్రతినిధులతో ఆర్టీసీ గ్రేటర్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఆర్టీసీ నుంచి అద్దె బస్సులు తీసుకున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు కేవలం తమ సంస్థ ఉద్యోగుల కోసం వీటిని ఉపయోగించే విధంగా సమావేశంలో చర్చించారు. తమ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని సాఫ్ట్‌వేర్ కంపెనీల యాజమాన్యం ఆర్టీసీకి తెలియజేసింది. సాఫ్ట్‌వేర్ సంస్థలకు అద్దెకు ఇవ్వాలనుకున్న బస్సులకు కిలోమీటర్ల వారీగా చార్జీలు వసూలు చేయనున్నట్లు గ్రేటర్ అధికారులు తెలిపారు.

సిటీ ఆర్డినరీ బస్సుకు 40 నుంచి 79 కిలోమీటర్ల వరకు నెలకు అద్దె రూ.59 వేల 280గా, 80 కిలోమీటర్లకు పైగా ఉన్న ప్రాంతానికి రూ. లక్షా 20 వేల 240 నిర్ణయించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు అద్దె 40 నుంచి 79 కిలోమీటర్లకు రూ. 64 వేల 480గా, 80 కిలోమీటర్లకు పైగా ఉంటే రూ. లక్షా 18 వేల 560 వసూలు చేయనున్నారు. అలాగే మినీ బస్సులకు 40 నుంచి 79 కిలోమీటర్ల లోపు రూ. 60 వేల 320, 80 కిలోమీటర్లకు పైగా ఉన్నట్లయితే రూ. లక్షా 06 వేల 80గా అద్దెను నిర్ణయించారు. తాజా ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఆర్టీసీకి మరింత ఆదాయం చేకూరనుంది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలకు టీఎస్ఆర్టీసీ బస్సులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details