ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంగన్​వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు పచ్చజెండా

By

Published : Nov 23, 2022, 4:26 PM IST

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు ()

High Court on Anganwadi Posts : అంగన్​వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 600పైచిలుకు అంగన్​వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయడంలేదని, అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

High Court on Anganwadi Posts : అంగన్​వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు పచ్చజెండా ఊపింది. నిబందనల ప్రకారం పోస్టులు భర్తీ చేయడం లేదంటూ.. పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపింది. అంగన్​వాడీ సూపర్ వైజర్ పోస్టులకు ఈ యేడాది సెప్టెంబర్​లో ప్రభుత్వం నోటిషికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ద్వారా 600 పైచిలుకు పోస్టులు భర్తీ చేయనున్నారు.

అభ్యర్ధులకు రాత పరీక్షలో 45 మార్కులు, వైవాలో 5 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష నిర్వహించిన అధికారులు కొందరికే వైవా నిర్వహిస్తున్నారంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు నిబంధనల ప్రకారమే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశారని మెరిట్ విద్యార్ధుల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

మెరిట్ విద్యార్ధులకు మాత్రమే వైవా నిర్వహిస్తారని నోటిఫికేషన్​లో ఉందని వాదనలు వినిపించారు. భర్తీ ప్రక్రియ కొనసాగించే విధంగా ఆదేశాలివ్వాలని కోరారు. అంగన్​వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై గతంలో హైకోర్టు స్టే విధించింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయాలంటూ గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ కోర్టు ఆదేశించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details