ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్యాన్సర్ చివరి దశలో ఉన్న రోగికి.. మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల అరుదైన చికిత్స

By

Published : Feb 16, 2023, 11:45 AM IST

Mangalagiri AIIMS Doctors Rare Surgery: మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఔరా అనిపించారు. క్యాన్సర్ చివరి దశలో ఉన్న ఓ రోగికి.. తినడానికి కూడా అడ్డంగా ఉన్న క్యాన్సర్ గడ్డలను తొలగించారు. దీంతో ప్రస్తుతం ఆమె మామూలుగానే ఆహారం తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

Mangalagiri AIIMS Doctors Rare Surgery
మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల అరుదైన చికిత్స

Mangalagiri AIIMS Doctors Rare Surgery: క్యాన్సర్ వస్తే ఇక అంతే అని జీవితంపై ఆశలు వదులుకోవడం ఒకప్పటి ఆలోచన.. కానీ ఇప్పుడు డాక్టర్లు అద్భుతాలు చేస్తున్నారు. అడ్వాన్స్​డ్ స్టేజ్​లో ఉన్న క్యాన్సర్​ని కూడా నయం చేయగలుగుతున్నారు. దీంతో ఎంతో మంది తమ జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభిస్తున్నారు. తాజాగా ఇలాంటి అద్భుతమే ఒకటి మంగళగిరి ఎయిమ్స్​లో చోటుచేసుకుంది. అసలు తినడానికి కూడా వీలుపడని స్థితిలో ఉన్న రోగికి.. క్యాన్సర్ గడ్డలను తొలగించారు.

గుంటూరు జిల్లాలోని మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ సర్జికల్ అంకాలజీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. క్యాన్సర్ చివరి దశలో ఉన్న ఓ రోగికి అన్నం తినడానికి అడ్డుపడుతున్న క్యాన్సర్ గడ్డలకు స్టంట్ వేశారు. దీంతో ప్రస్తుతం ఆ రోగి మాములుగానే ఆహారం తీసుకుంటున్నారు.

రోగి బతికున్నంత కాలం ఆహారం తీసుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇది అరుదైన చికిత్స అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ.. ప్రధాన మంత్రి కార్యాలయానికి మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు ట్యాగ్ చేయగా పీఎం కార్యాలయం వారిని ప్రశంసించింది. వైద్యపరిభాషలో పాల్లియేటీవ్ ప్రొసీజర్ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన 55 ఏళ్ల మహిళకు కాలేయం పూర్తిగా దెబ్బతింది. దీంతో కాలేయం లోపలికి క్యాన్సర్ గడ్డలు పోవడంతో వాటిని శస్త్రచికిత్స చేసి తొలిగించటం అసాధ్యమని భావించిన వైద్యులు స్టంట్ చేసి వాటిని తొలగించారు. ఈ చికిత్స చేయక ముందు.. ఆ మహిళ ఏమి తినాలన్నా గడ్డలు అడ్డుపడటంతో తినలేకపోయేవారు. మింగలేకపోయేవారు.

కొన్ని సార్లు బలవంతంగా తిన్నా సరే జీర్ణాశయం సాఫీగా లేక వాంతి చేసుకునేవారు. క్యాన్సర్ ముదిరి చివరి దశలో ఉన్న ఆ రోగికి తాజాగా మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యులు చేసిన చికిత్సతో సాధారణ స్థితికి చేరుకున్నారు. దీంతో ప్రస్తుతం బతికున్నంత వరకు ఆమె అన్నం తినటానికి, మింగటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details