ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిల్లీ లిక్కర్ స్కామ్.. నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

By

Published : Jan 2, 2023, 5:36 PM IST

Delhi Liquor Scam Case Updates: దిల్లీ లిక్కర్ స్కాం కేసులోని నలుగురు నిందితులకు రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది. ఈడీ విజ్ఞుప్తి మేరకు.. నిందితులకు ఈనెల 7 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.

delhi liquor scam
దిల్లీ లిక్కర్ స్కామ్

Delhi Liquor Scam Case Updates: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్​ను రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి రిమాండ్​ను.. ఈనెల 7 వరకు పొడిగించింది. ఈ మేరకు ఈడీ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోనికి తీసుకుంది. ఈ కేసులో ఈనెల 5న మరో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది.

సౌత్‌గ్రూప్‌ లావాదేవీలపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు ఈడీ పేర్కొంది. సమీర్ మహేంద్రు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనుంది. అభిషేక్, విజయ్ నాయర్‌ బెయిల్‌ పిటిషన్లపై ఈనెల 4న.. శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై జనవరి 7న.. బినోయ్‌ బాబు బెయిల్‌ పిటిషన్‌పై జనవరి 9న విచారణ నిర్వహించనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details