ETV Bharat / sports

మిషన్ 2024 టార్గెట్​​.. లంకతో భారత్​ ఢీ.. పాండ్య సేన బోణీ కొడుతుందా?

author img

By

Published : Jan 2, 2023, 4:37 PM IST

రేపు జరగబోయే భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్​ కోసం క్రికెట్​ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో ఏలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఆ వివరాలు..

India vs Srilanka Test Series
India vs Srilanka

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. ముంబయిలో వాంఖడే వేదికగా మంగళవారం రాత్రి ఏడు గంటలకు జరగనున్న మ్యాచ్‌లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. బిగ్‌ త్రి..రోహిత్‌, విరాట్‌, రాహుల్​లు లేకుండానే టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీ ట్వీంటీ జట్టుకు పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ హార్దిక్‌ పాండ్య.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. మిషన్‌ 2024 టార్గెట్‌గా భారత జట్టు సమాయత్తం అవుతోందని వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌ దిశగా పాండ్యా జట్టును సిద్ధం చేయనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించనున్నాయి. భవిష్యత్తులోనూ బిగ్‌ త్రీ.. టీ ట్వంటీ ఫార్మట్‌కు వీడ్కోలు పలికితే ఇప్పటినుంచే జట్టునుల సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే హార్దిక్‌ సారథ్యంలో న్యూజిలాండ్‌ టీ ట్వీంటీ సిరీస్‌ను కైవసం చేసుకున్న యువ జట్టు శ్రీలంక సిరీస్‌ను హస్తగతం చేసుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు.

కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌ కలిసి ఓపెనింగ్‌గా బరిలోకి దిగారు. కానీ ఈ సిరీస్‌లో పంత్‌ ఆడకపోవడంతో ఓపెనింగ్‌ మరోసారి టీమిండియాకు తలనొప్పిగా మారనుంది. ఇషాన్‌ కిషన్‌-రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. శుభమన్ గిల్‌ను కూడా ఓపెనర్‌గా పరీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ డౌన్‌ ప్రపంచ నంబర్ వన్‌ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. దీపక్ హుడా సంజు శాంసన్ లకు తుది జట్టులో స్థానం దక్కవచ్చు. రాహుల్ త్రిపాఠి, శివమ్ మావి, ముఖేష్ కుమార్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్‌లు, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సిరీస్ ఓపెనర్‌లో ఆడాలని భావిస్తే గనుక సుందర్‌కు స్థానం దక్కకపోవచ్చు.

ఈ సిరీస్‌లో గెలిచి భారత్‌కు స్వదేశంలో గట్టి ఎదురుదెబ్బ ఇవ్వాలని లంక టీమ్​ భావిస్తోంది. గతం కంటే బలహీనంగా మారిన లంక మళ్లీ ఫామ్​ను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. లంక ప్రీమియర్ లీగ్‌లో స్టార్ పెర్ఫార్మర్లుగా ఉన్న అవిష్క ఫెర్నాండో, చమిక కరుణరత్నే, సదీర సమరవిక్రమపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. ఫెర్నాండో, కరుణరత్నె స్థాయికి తగ్గట్లు రాణిస్తే హార్దిక్‌ సేనకు తిప్పలు తప్పక పోవచ్చు. బౌలింగ్‌లోనూ లంక పర్వాలేదనిపించేలా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.