ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Nov 24, 2022, 8:58 AM IST

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చేశారు..
    Demolition of houses in Chandrayanagar: ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత ఘటన కళ్లముందు మెదులుతుండగానే.. గుంటూరులోనూ అదే తరహా విధ్వంసం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. శ్రీనగర్‌ కాలనీ చంద్రయ్యనగర్‌లో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను కూల్చడం వివాదాస్పదమైంది. నోటీసులు లేకుండా, తగిన గడువు ఇవ్వకుండా ఒక్కసారిగా నివాసాలు కూల్చివేస్తే.. ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా పొక్లెయిన్‌లతో మీదపడటంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైసీపీలో కీలక మార్పులు..పలువురికి ఉద్వాసన
    అధికార వైకాపాలో కీలక మార్పులు జరిగాయి. ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల, బుగ్గన, అనిల్‌, కొడాలి నానికి ఉద్వాసన పలికారు. 8 జిల్లాల పార్టీ అధ్యక్షులనూ మార్చేశారు. ఎంపీ అయోధ్యరామిరెడ్డికి పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించగా... అనుబంధ విభాగాల సమన్వయకర్తగా చెవిరెడ్డిని నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • న్యాయం కోసం వృద్ధురాలి పోరాటం
    Old woman is fight for justice in Nellore district: అసలే 60 ఏళ్ల వృద్ధురాలు, ఆపైన దివ్యాంగురాలు. భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఆ మహిళ పట్ల.. స్థానిక నాయకులు కుట్రలు చేశారు. నాయకులతో చేతులు కలిపిన అధికారులు.. ఆమె ఇంటి స్థలాన్ని వేరొకరికి కట్టబెట్టారు. ఈ దురాగతాన్ని తట్టుకోలేకపోయిన వృద్ధురాలు.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కింది. కనీస స్పందన లేకపోవడంతో.. అక్కడే నిరసనకు దిగింది. అయినా పోలీసుల మనసు కరగలేదు. ఆమెకు న్యాయం జరగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వలపు వల వేసి నిలువు దోపిడి..
    A woman Sai is a prostitute in Vijayawada: సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయాలు పెంచుకుంటుంది. యువతులతో వారికి ఫోన్లు చేయించి వలపు వల విసురుతుంది. ఆ తర్వాత వాళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో దాడి చేసి.. గుట్టు బయటపెడతానంటూ బెదిరిస్తుంది. ఇదే అదునుగా బాధిత యువకుల నుంచి డబ్బులు గుంజుతుంది. ఇదీ.. విజయవాడకు చెందిన ఓ వైసీపీ నాయకురాలి నిర్వాకం. ఈ వ్యవహారంలో నిందితురాలు పరసా సాయితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితురాలు సాయికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేవుడి నిమజ్జనంలో బాణాసంచా పేలుడు.. 40 మందికి తీవ్ర గాయాలు
    ఒడిశాలోని ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కార్తీకేశ్వర స్వామి నిమజ్జనం నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండేళ్ల తరువాత కనిపించిన అరుదైన నల్ల చిరుత
    బంగాల్​లో​ రెండేళ్ల తరువాత అరుదైన ఓ బ్లాక్​ పాంథర్ కనిపించింది. మిరిక్​లోని తేయాకు తోటలో రోడ్డు దాటుతున్న నల్ల చిరుతను ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్​మీడియాలో పోస్ట్ చేయగా బ్లాక్​ పాంథర్​ ఫొటోలు వీడియో వైరల్​గా మారాయి. అంతకుముందు 2020లో ఇదే ప్రాంతంలో బ్లాక్​ పాంథర్​ కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రష్యాను 'ఉగ్రవాద ప్రోత్సాహక దేశం'గా ప్రకటించిన EU పార్లమెంట్‌
    పౌరుల స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతోన్న దాడులను ఈయూ పార్లమెంట్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోన్న రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మొబైల్‌.. కంప్యూటర్‌.. బ్యాంకింగ్‌.. అన్నింటిలోనూ ఉద్యోగ కోతలే.. కారణమేంటి?
    మొబైల్‌ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, చైనా మొబైల్‌ కంపెనీలు దేశీయంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగ కోతలు ప్రారంభించగా, మొబైల్‌ - కంప్యూటర్‌ తయారీ సంస్థలు, బ్యాంకింగ్‌ దిగ్గజమూ ఇదే బాట పడుతున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టెన్నిస్‌ మహిళా నెం.1 ర్యాంకర్‌కూ తప్పని లైంగిక వేధింపులు
    పోలాండ్​ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారిణి స్వియాటెక్ లైంగిక వేధింపులకు గురైంది. అయితే తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలను ఆమె స్వయంగా బహిర్గతం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వీరసింహారెడ్డి'లో బాలయ్య రాజసం.. ఫస్ట్​ సాంగ్​ అప్డేట్.. రిలీజ్​ ఎప్పుడంటే?
    'వీరసింహారెడ్డి'తో సంక్రాంతి హీరోగా మరోసారి సందడి చేయనున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. తాజాగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఈ నెల 25న 'జై బాలయ్య..' అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details