వైసీపీ నాయకురాలి నిర్వాకం... వలపు వల వేసి నిలువు దోపిడి..

author img

By

Published : Nov 24, 2022, 7:42 AM IST

Updated : Nov 24, 2022, 10:23 AM IST

వలపు వల వేసి నిలువు దోపిడి

A woman Sai is a prostitute in Vijayawada: సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయాలు పెంచుకుంటుంది. యువతులతో వారికి ఫోన్లు చేయించి వలపు వల విసురుతుంది. ఆ తర్వాత వాళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో దాడి చేసి.. గుట్టు బయటపెడతానంటూ బెదిరిస్తుంది. ఇదే అదునుగా బాధిత యువకుల నుంచి డబ్బులు గుంజుతుంది. ఇదీ.. విజయవాడకు చెందిన ఓ వైసీపీ నాయకురాలి నిర్వాకం. ఈ వ్యవహారంలో నిందితురాలు పరసా సాయితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితురాలు సాయికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

విజయవాడ పటమటలోని తోటవారి వీధికి చెందిన పరసా సాయి.. రైతు బజారులో కూరగాయల దుకాణం, హైస్కూలు రోడ్డులో దుస్తుల దుకాణం నిర్వహిస్తోంది. తన దుకాణాలకు వచ్చే వారిలో ఆర్థికంగా వెనుకబడిన యువతులను లక్ష్యంగా చేసుకుని.. కొందరికి మద్యం అలవాటు చేసింది. వారు మత్తులో ఉన్నపుడు, దుస్తులు మార్చుకునే సమయంలో రహస్యంగా నగ్న చిత్రాల్ని సేకరించి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది. వారి ఫొటోలను విటులకు చూపించి బేరాలు కుదుర్చుకునేది.

పటమటకు చెందిన ఇద్దరు యువతులతో సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిపించి, ఓ యువకుడితో మాట్లాడించింది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో గవర్నర్‌పేటలోని ఓ హోటల్‌కు అతడ్ని రప్పించింది. ఆ యువకుడు, యువతి ఏకాంతంగా ఉండగా.. మరో ముగ్గురితో కలిసివచ్చి పరసా సాయి బెదిరింపులకు పాల్పడింది. వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకు 2 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుంది.

అతడు దశల వారీగా లక్షా 90 వేలు చెల్లించగా.. మిగిలిన 10 వేలు ఇవ్వాలంటూ వేధించింది. విసుగు చెందిన సదరు యువకుడు.. పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సాయితోపాటు ఆమెకు సహకరిస్తున్న ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితురాలిని విచారించగా.. తనకు సహకరించిన వారి పేర్లు చెప్పినట్లు తెలిసింది. వారిలో కొందరు వైసీపీ నాయకుల పేర్లు ఉన్నాయని సమాచారం. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సంశయిస్తున్నట్లు తెలిసింది.

నిందితురాలు సాయి గత ఏడాది వైసీపీలో చేరింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలు, ఫొటోలను చూసి పోలీసులే అవాక్కయ్యారట. కొందరు యువతులతో నిందితురాలు సన్నిహితంగా ఉన్న వీడియోలూ ఫోన్‌లో ఉన్నాయి. సాయిపై పటమట స్టేషన్‌లో గతంలోనూ రెండు కేసులు నమోదయ్యాయి. బంధువుల అబ్బాయిని కిడ్నాప్‌ చేయించి డబ్బుల కోసం బెదిరించడంపై ఓ కేసు, తన దగ్గర పని చేస్తున్న వ్యక్తిని తాగిన మత్తులో చితకబాదినందుకు మరో కేసు నమోదు చేశారు.

వలపు వల వేసి నిలువు దోపిడి..

ఇవీ చదవండి:

Last Updated :Nov 24, 2022, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.