ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా కల్పించాలి'

By

Published : Apr 4, 2020, 8:05 PM IST

విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు ఆరోగ్య బీమా కల్పించాలని... తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా పాత్రికేయులు ప్రాణాలకు తెగించి ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలకు చేరవేస్తున్నారని కొనియాడారు.

anagani satya prasad
anagani satya prasad

పాత్రికేయులకు ప్రభుత్వాలు అండగా నిలిచి 50 లక్షల రూపాయలను ఆరోగ్య బీమా కల్పించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. కరోనా ప్రభావంతో దేశంలోని ప్రజలంతా అల్లాడుతున్నా పాత్రికేయులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని ఆయన కొనియడారు. కరోనాపై ప్రజల్ని అప్రమత్తం చేయడంలో, ప్రజల అవస్థల్ని ప్రభుత్వానికి చేరవేయడంలోనూ వీరి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్లు అందించాలని సూచించారు. అక్రిడేషన్ కలిగిన ప్రతి పాత్రికేయుడికి ప్రభుత్వం నిత్యావసర సరకుల్ని అందించాలన్నారు. ఫీల్డ్​లో ఉన్న వారికి అవసరమైన పాస్​లు అందించి వారి విధులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం చూసుకోవాలని అనగాని ఓ ప్రకటనలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details