ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ రోడ్డుపై వెళ్లాలంటే చాలు... వణికిపోతున్న వాహనదారులు

By

Published : Nov 24, 2021, 7:17 AM IST

Updated : Nov 24, 2021, 6:27 PM IST

auto

ఆ దారి చూస్తే చాలు వాహనదారులకు వణుకు వస్తుంది. ఆ రోడ్డెక్కితే సీఎం కాన్వాయైనా కుయ్యో మొర్రో అని.. మొత్తుకోవాల్సిందే.! అంతా అధ్వానంగా ఉంటోంది ఆ మార్గం. తాజా ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ ఆటో ముందు చక్రం ఊడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ రోడ్డు మార్గం ఎక్కడో తెలుసా...

తూర్పుగోదావరి జిల్లా(East Godavari district)లోని కోనసీమ ప్రధాన రహదారిని(worst road) చూస్తే వాహనదారులు వణికిపోతున్నారు. అయిదు నియోజకవర్గాలను కలుపుతూ వెళ్లే ఆ మార్గంలో అడుగుకో గుంత ఉండటంతో ప్రతిరోజూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం గుంతలో పడి ఒక ఆటో ముందు చక్రం ఊడిపోయింది. రాజమహేంద్రవరానికి చెందిన ఆటో డైవ్రర్‌ పొన్నా వీరబాబు అమలాపురానికి వెళ్తుండగా రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్లే మార్గంలో గుంతలో పడి ఆటో ముందు చక్రం, పోర్క్‌ విరిగిపోయింది. ఆటో బాగు చేసుకునేందుకు రూ.15వేల వరకు ఖర్చు అవుతుందని వీరబాబు కంటతడి పెట్టుకున్నాడు.

కోనసీమతో పాటు కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం సహా దాదాపు అన్నీ డివిజన్లలో పరిస్థితి ఇలానే ఉంది. వాహనం బయటకు తీస్తే ఇంటికి వెళతామో లేదో తెలియని దుస్థితి నెలకొందని.. దారి పొడవునా మోకాళ్ల లోతు గుంతలున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమలో ప్రయాణం.. నరక ప్రాయమంటోన్న వాహనదారులు


ఇదీ చదవండి

Teacher takes alcohol: "సారు దగ్గర సారా వాసన.. ఆయన మాకొద్దు"

Last Updated :Nov 24, 2021, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details