ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DEATH: విషాదం... గోదావరిలో గల్లంతై ఇద్దరు విద్యార్థులు మృతి

By

Published : Nov 12, 2021, 7:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంక(pichukalanka in east godavari district) వద్ద విషాదం నెలకొంది. గోదావరి నది(godavari river)లో స్నానం చేస్తూ ఇద్దరు ఐటీఐ విద్యార్థులు(ITI students) గల్లంతయ్యారు.

గోదావరిలో గల్లంతై ఇద్దరు విద్యార్థులు మృతి
గోదావరిలో గల్లంతై ఇద్దరు విద్యార్థులు మృతి

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరంలోని వివేకానంద కళాశాలలో ఐటీఐ చేస్తున్నారు. సరదాగా గడిపేందుకు పిచ్చుకలంక వద్ద గోదావరికి వచ్చిన యువకులు.. స్నానం చేసేందుకు నీటిలో దిగారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న స్థానికులు పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details