ఆంధ్రప్రదేశ్

andhra pradesh

heavy rains: మన్యంలో భారీ వర్షాలు... కొట్టుకుపోయిన వంతెన

By

Published : Oct 8, 2021, 11:33 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రంపచోడవరం మండలంలో వంతెన కొట్టుకుపోయింది. ఆ మార్గంలో వెళ్లే ఉపాధ్యాయులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

heavy rains
heavy rains

తూర్పు గోదావరి జిల్లా మన్యంలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రంపచోడవరం మండలంలో వంతెన కొట్టుకుపోయింది. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే గిరిజనులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి వేములకొండ పంచాయతీ పందిరిమామిడి నుంచి వాడపల్లి వెళ్లే రహదారి లోనూ కొండ వాగులు పొంగి ప్రవహించాయి.

ABOUT THE AUTHOR

...view details