ఆంధ్రప్రదేశ్

andhra pradesh

3 వేల 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

By

Published : Apr 23, 2020, 6:39 PM IST

లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో నాటుసారా వినియోగం పెరిగింది. నాటుసారా తయారుచేయడం, విక్రయించడం తప్పని తెలిసినా కొందరు తయారుచేస్తూనే ఉన్నారు. తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు జరిపి బెల్లం ఊటను ధ్వసం చేస్తున్నారు.

police attacks on cheap liquor produce centres at gannavaram constituency in east godavari district
బెల్లం ఊట ధ్వంసం చేస్తున్న పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని గాజుల గుంట గ్రామ పరిధిలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తయారీదారులు రహస్యంగా నిల్వచేసిన నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్.ఐ హరీష్ కుమార్ తెలిపారు. దాదాపు 3 వేల 200 లీటర్ల ఊట ధ్వసం చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details