ఆంధ్రప్రదేశ్

andhra pradesh

OLD WOMEN MURDER:మందలిస్తే.. ప్రాణం తీశారు

By

Published : Nov 29, 2021, 9:30 AM IST

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడిలో ఈనెల 26న కోడెల్ల నాగమ్మ(73) హత్యకు గురైన కోడెల్ల నాగమ్మ హత్య కేసును పోలీసులు చేధించారు.

OLD WOMEN MURDER
OLD WOMEN MURDER

చెడు వ్యసనాలకు బానిస కావొద్దని మందలించినందుకు ఓ విద్యార్థి, మరో యువకుడు కలిసి వృద్ధురాలిని హతమార్చారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడిలో ఈనెల 26న కోడెల్ల నాగమ్మ(73) హత్యకు గురయ్యారు. ఆ కేసు వివరాలను ఆదివారం కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై శుభశేఖర్‌ వివరించారు. గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలుడు(16) మద్యానికి అలవాటుపడ్డాడు. చిన్నచిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. ఇటీవల పుట్టినరోజు జరుపుకొన్నాడు. అనంతరం స్నేహితుడు ఇండుగుమల్లి నవీన్‌(24)తో కలిసి మద్యం మత్తులో తూగుతుండగా నాగమ్మ మందలించింది. ఈ వయసులో ఇలా చెడిపోతారెందుకని తిట్టడంతో ఆమెపై కోపం పెంచుకున్నారు. అర్ధరాత్రి ఇద్దరూ కలిసి ఒంటరిగా ఉంటున్న ఆ వృద్ధురాలిపై దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details