ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి లోడ్ టెస్టింగ్

By

Published : Nov 9, 2020, 4:39 PM IST

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనం లోడ్ టెస్టింగ్​కు అవసరమైన ఏర్పాట్లను కన్సల్టెంట్ ఇంజనీరింగ్ సంస్థ సిద్ధం చేసింది. పిల్లర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వాటిపై గడ్డర్లు ఏర్పాటు చేసి బరువైన ఇసుక సంచులను ఉంచారు.

నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి లోడ్ టెస్టింగ్
నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి లోడ్ టెస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనం లోడ్ టెస్టింగ్​కు అవసరమైన ఏర్పాట్లను కన్సల్టెంట్ ఇంజనీరింగ్ సంస్థ సిద్ధం చేసింది. రూ. 80 కోట్ల కేంద్ర నిధులతో అయిదు అంతస్తుల్లో వంద పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. భవనం నిర్మించేందుకు అవసరమైన 100 పిల్లర్లను గత నెల రోజులు శ్రమించి కేంద్ర ప్రజా పనులశాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో పూర్తి చేశారు. పిల్లర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వాటిపై గడ్డర్లు ఏర్పాటుచేసి బరువైన ఇసుక సంచులను పేర్చారు.

ABOUT THE AUTHOR

...view details