ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Irregularities for PG Medical Seats in AP: మరోసారి వెలుగులోకి వచ్చిన వైద్య కళాశాలల నకిలీ సీట్ల స్కామ్.. అనుమతి పత్రం ఫేక్‌ అని వెల్లడించిన ఎన్ఎంసీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 2:23 PM IST

Updated : Sep 7, 2023, 2:37 PM IST

Irregularities for PG Medical Seats in AP: ప్రైవేటు వైద్య కళాశాలల అక్రమాలు.. నకిలీ అనుమతి పత్రాల రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. పీజీలో మూడు కళాశాలలకు అదనపు సీట్లను పెంచారంటూ బహిర్గతమైన నకిలీ అనుమతి పత్రాలు సంచలనం సృష్టిస్తుండగానే.. రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ కళాశాల ఘనకార్యం మరోసారి వెలుగులోకి వచ్చింది.

Irregularities_for_PG_Medical_Seats_in_AP
Irregularities_for_PG_Medical_Seats_in_AP

Irregularities for PG Medical Seats in AP: మరోసారి వెలుగులోకి వచ్చిన వైద్య కళాశాలల నకిలీ సీట్ల స్కామ్.. అనుమతి పత్రం ఫేక్‌ అని వెల్లడించిన ఎన్ఎంసీ

Irregularities for PG Medical Seats in AP: రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలల అక్రమాలు.. నకిలీ ఎల్‌ఓపీల రూపంలో ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. పీజీలో మూడు కళాశాలల్లో బయటపడిన నకిలీ సీట్ల స్కామ్ తీవ్ర దుమారం రేపుతుండగా.. తాజాగా మరో కుంభకోణాన్ని ఎన్ఎంసీ(జాతీయ వైద్య కమిషన్‌) గుర్తించింది. రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయాగ్నసిస్‌ కోర్సులో 10కి బదులు 24 సీట్లను కేటాయిస్తూ తమ నుంచి వెలువడినట్టున్న అనుమతి పత్రం ఫేక్‌ అని ఎన్ఎంసీ(National Medical Commission) మంగళవారం ప్రకటించింది. ఈ కోర్సులో సీట్ల పెంపుపై జీఎస్‌ఎల్‌ కళాశాల యాజమాన్యం నుంచి తమకు దరఖాస్తే రాలేదని తెలిపింది. దీనికి 2023 మార్చి 24న జారీ చేసిన అనుమతి పత్రాన్ని జత చేసింది.

Irregularities for PG Medical Seats: ఏపీలో పీజీ వైద్య సీట్ల స్కామ్ గుర్తించిన ఎన్ఎంసీ.. నకిలీ ఆదేశాలను పంపించింది ఎవరు..?

Illegal Medical Seats: గతవారం వెలుగులోకి వచ్చిన నకిలీ ఎల్‌ఓపీల విషయంలో బాధ్యుల గురించి దిల్లీలో విచారణ కొనసాగుతుండగానే.. ఎన్‌ఎంసీ తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. దీంతో పీజీ వైద్య విద్యలో ప్రైవేటు కళాశాలల్లో రెండో కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. తొలివిడత మాదిరే రెండో విడత కౌన్సెలింగ్‌లో చేపట్టిన సీట్ల కేటాయింపును రద్దు చేసే అవకాశం ఉండటంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనలో పడిపోయారు. గత నాలుగేళ్లుగా ఆరోగ్య విశ్వవిద్యాలయం, వైద్యవిద్య ప్రవేశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గందరగోళంగా ఉంటున్నాయి.

Medical Colleges in AP: వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారుగా జగన్‌.. కోటీశ్వరులకే 50 శాతం సీట్లు

PG Medical Seats Scam in AP: సొంత ప్రయోజనాల కోసం ఒత్తిడి తేవడం, బోధనేతర సిబ్బంది కొరతను పట్టించుకోకపోవడం, విశ్వవిద్యాలయానికి సంబంధించిన 400 కోట్లను వాడుకోవడం, వ్యవస్థలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో నకిలీ సీట్ల కుంభకోణం దెబ్బకు పూర్తిగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియపైనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా.. గతవారం నంద్యాలలోని శాంతిరామ్‌ వైద్య కళాశాలకు 50, రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలకు 63, విజయనగరంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళాశాలకు 23 చొప్పున సీట్లు కేటాయించినట్లున్న నకిలీ ఎల్‌ఓపీల భాగోతం బయటపడింది.

Irregularities for PG Medical Seats in AP: పీజీ వైద్య సీట్ల కోసం అక్రమాల దందా..నకిలీ పత్రాలతో సీట్ల పెంపును గుర్తించిన ఎన్‌ఎంసీ

Hikes Medical Seats in AP: దీనిపై ఎన్‌ఎంసీ అధికారులు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్‌ఎంసీ విచారణకు సహకరిస్తామని ప్రకటించినప్పటికీ వెంటనే వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు. కాగా.. నకిలీ పత్రాలతో తమకు సంబంధం లేదని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నందున మళ్లీ అదే సంఘటన చోటుచేసుకోవడం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది. పీజీ వైద్య విద్యలో రేడియో డయాగ్నసిస్‌ కోర్సుకు డిమాండ్‌ ఉంది. జనరల్‌ మెడిసిన్‌తోపాటు సమానంగా ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కోర్సు పూర్తిచేస్తే సూపర్‌ స్పెషాల్టీ కోర్సు చేయక్కర్లేదు. అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎమ్మారై ద్వారా జరిగే పరీక్షల తీరును వీరు పరిశీలిస్తారు. ఇలాంటి కోర్సులో పదికి బదులు 24 సీట్లు పొందడమంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు.

AP Medical seats for sale ఏడాదిలో 694 ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధుల సీట్లను అమ్మేస్తారా ! ఇదేనా బడుగు బలహీనవర్గాలపై ప్రేమ..

Last Updated : Sep 7, 2023, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details