ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఒకే ఒక విద్యార్థి.. ఆమె కోసం ఎంతమంది ఉపాధ్యాయులంటే..!

By

Published : Dec 29, 2022, 3:21 PM IST

One Student - Five Teachers : అక్షరాస్యతను పెంచడానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కస్తూర్భా గాంధీ విద్యాలయాలు కొన్ని అధికారుల నిర్లక్ష్యపు నీడలో వెనకబడిపోతున్నాయి. సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యాలయాల్లో విద్యార్థులు కరువవుతున్నారు. అలాంటి పరిస్థితే ఉంది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లోని కేజీబీవీలో.

One Student
ఒకే ఒక విద్యార్థి

One Student - Five Teachers :తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభించారు. గతేడాది ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన బాలికలు, ఇతర విద్యార్థినులు సుమారు వంద మంది చేరారు. అయితే అధ్యాపకుల నియామకంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో విద్యార్థినులు ఒక్కొక్కరుగా ఇతర కళాశాలల్లో చేరారు. ఎట్టకేలకు నవంబరులో ఇక్కడ ఐదుగురు అధ్యాపకులను నియమించారు. అప్పటికి ఎంపీసీలో ఒకరు, బైపీసీలో 12 మంది విద్యార్థినులు మిగిలారు. ఎంపీసీ గ్రూపులో మిగిలిన ఒకే విద్యార్థిని.. ఆమెకు బోధిస్తున్న అధ్యాపకురాలిని చిత్రంలో చూడవచ్చు.

ABOUT THE AUTHOR

...view details