ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమార్జనకు పాల్పడుతూ అడ్డంగా బుక్కైన ఎక్సైజ్ సీఐ, ఎస్​ఐ

By

Published : Feb 1, 2022, 7:32 PM IST

అక్రమార్జనకు పాల్పడుతున్న ఇద్దరు ప్రభుత్వ అధికారులను చిత్తూరు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. బినామీ వ్యక్తి సహకారంతో మద్యం దుకాణాన్ని నడుపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.

అక్రమార్జనకు పాల్పడుతున్న ఎక్సైజ్ ఉద్యోగుల గుట్టురట్టు
అక్రమార్జనకు పాల్పడుతున్న ఎక్సైజ్ ఉద్యోగుల గుట్టురట్టు

ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తూ అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడిన ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్సైలు కటకటాల పాలైన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ మద్యం డిపోలో సీఐ జవహర్ బాబు, ఎస్సై సురేశ్ కుమార్ పని చేస్తున్నారు. మదనపల్లె పట్టణంలో బినామీ వ్యక్తులను అడ్డం పెట్టుకుని నిందితులు ఆనంద్ బార్​ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బినామీ వ్యక్తికి.. నిందితుల మధ్య వివాదం ఏర్పడడంతో బాధితుడు శివ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆనంద బార్​ను ఎక్సైజ్ శాఖ అధికారులు చట్టవిరుద్ధంగా బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారని.. పైగా ఇండెంట్ ద్వారా కొనుగోలు చేసిన సరకు అమ్మకుండా బయటి ప్రాంతాల నుంచి తెచ్చిన మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ బార్​ వేరే మహిళ పేరుతో ఉందని.. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నారని పోలీసులు వివరించారు. బార్ అసలు యజమాని అయిన మహిళ నుంచి నిందితులు లీజుకు మాట్లాడుకుని వ్యాపారం మొదలుపెట్టినట్లు గుర్తించారు. గత నెల 10న సీఐ, ఎస్సైలు కొంతమంది అనుచరులను వెంట తీసుకుని బార్ ను పగలగొట్టడానికి ప్రయత్నించగా.. బాధితుడు శివ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details