ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURDER: శ్రీకాళహస్తిలో యువకుడి దారుణహత్య..పాత కక్షలేనా..!

By

Published : Sep 9, 2021, 1:19 PM IST

Updated : Sep 9, 2021, 2:57 PM IST

శ్రీకాళహస్తిలో యువకుడి దారుణహత్య
శ్రీకాళహస్తిలో యువకుడి దారుణహత్య

13:16 September 09

సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు

శ్రీకాళహస్తిలో యువకుడి దారుణహత్య

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఇమ్రాన్​ఖాన్(28)ను మంగళవారం రాత్రి భక్త కన్నప్ప వంతెనపై ప్రత్యర్థులు కిరాతకంగా దాడి చేశారు. రెండు చేతులు విరిగిపోవడంతో పాటు జననాంగాల పైన దాడి జరగడంతో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వంతెన సమీపంలో అమర్చిన సీసీ పుటేజీల్లో దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్​పై  పలు కేసులు ఉండడంతో పాత దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:సంగం డెయిరీ న్యాయవాది వేణుగోపాల్ అరెస్టు

Last Updated : Sep 9, 2021, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details