ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిబంధనలకు వ్యతిరేకంగా ఉందంటూ.. తెదేపా కార్యాలయ భవన యజమానికి నోటీసులు

By

Published : Nov 12, 2022, 10:02 AM IST

TDP OFFICE IN CHITTOOR : ఓ యజమాని తన భవనాన్ని తెదేపా కార్యాలయం నిర్వహణకు అద్దెకు ఇచ్చాడు. అయితే ఆ భవనాన్ని మున్సిపల్​ అధికారులు మాత్రం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా కూల్చివేతలకు సిద్దమైయ్యారు. మళ్లీ అదే రోజు సాయంత్రం వచ్చి రెండో సారి నోటీసులు ఇచ్చి యజమానిని బెదిరించారని చల్లా బాబు అనే వ్యక్తి ఆరోపించారు.

TDP OFFICE IN CHITTOOR
TDP OFFICE IN CHITTOOR

MUNICIPAL OFFICERS GIVE NOTICES : చిత్తూరు జిల్లా పుంగనూరులోని వివేకానందనగర్‌లో తెదేపా కార్యాలయానికి అద్దెకు ఇచ్చిన భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇవ్వడం.. ఒకానొక దశలో కూల్చివేతకు సిద్ధమవడంతో సంబంధిత యజమాని లోపల ఉన్న సామగ్రిని శుక్రవారం సాయంత్రం బయట పెట్టేశారు. గురువారం ఇదే కార్యాలయంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి మండల తెదేపా గ్రామ, బూత్‌ కమిటీలు ఏర్పాటు చేయగా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ భవనం అక్రమ కట్టడమంటూ మున్సిపల్‌ అధికారులు యజమాని జయచంద్ర నాయుడుకు రెండో నోటీసు ఇచ్చి.. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. మళ్లీ శుక్రవారం ఉదయం నుంచి కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తారా? లేదంటే భవనాన్ని కూల్చేయమంటారా? అని మున్సిపల్‌ అధికారులు, వైకాపా నాయకులు యజమానిని వేధించారని చల్లా బాబు ఆరోపించారు.

తెదేపా కార్యాలయ భవన యజమానికి పురపాలక అధికారుల నోటీసులు

ABOUT THE AUTHOR

...view details