ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కెనమాకులపల్లిలో పశువుల పండుగ

By

Published : Nov 7, 2019, 9:41 PM IST

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లిలో పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పశువులను తీసుకువచ్చి పరుగుల పోటీలు పెట్టారు.

Cattle festival in chittoor district

కెనమాకులపల్లిలో ఘనంగా పశువుల పండుగ

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లిలో పశువుల పండుగను ఘనంగా ప్రారంభించారు. ఏటా జనవరిలో సంక్రాంతి సందర్భంగా పశువుల పండుగను ఇక్కడ నిర్వహిస్తారు. అయితే ఇక్కడ నవంబర్ నెలలో పశువుల పండుగను కోలాహలంగా నిర్వహించడం విశేషం. తక్కువ సమయంలో నిర్ణయించిన దూరం పరిగెత్తే పశువుల యజమానులకు బహుమతులను ప్రకటించటంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పశువులను తీసుకువచ్చి పరుగులు పెట్టించారు. పోటీలను చూసేందుకు వేలాదిగా జనం తరలిరావటంతో గ్రామం కిక్కిరిసిపోయింది. జనం మధ్యలో పరిగెత్తే పశువులను నిలువరించేందుకు యువత పోటీ పడ్డారు. అతి తక్కువ సమయంలో దూరాన్ని చేరుకున్న పశువుల యజమానులకు గ్రామస్థుల ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేశారు. ఈ పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Intro:ap_tpt_81_07_pasuvulapandaga_avb_ap10009

కోలాహలంగా పశువుల పండుగ
జనం మధ్య పరుగులెత్తిన పశువులు
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం kena మా కుల పల్లి లో పశువుల పండుగను ఇవాళ ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా జనవరిలో సంక్రాంతి సందర్భంగా పశువుల పండుగ నిర్వహిస్తారు అయితే తే ఇక్కడ నవంబర్ నెలలో పశువుల పండుగను కోలాహలంగా నిర్వహించడం విశేషం తక్కువ సమయంలో పరిగెత్తే పశువులకు బహుమతులను ప్రకటించడంతో తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పశువులను తీసుకువచ్చి పరుగులు పెట్టించారు రు రు పండుగలు పరిగెత్తే పశువులను చూసేందుకు వేలాదిగా జనం తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది జనం మధ్యలో పరిగెత్తే పశువులను నిలువరించేందుకు యువత పోటీ పడ్డారు అతి తక్కువ సమయంలో దూరాన్ని చేరుకున్న పశువులకు గ్రామస్తులు ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేశారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన పశువుల పండుగ లో వేలాది పశువులు పరుగెత్తాయి కొన్ని పశువులు జనం పైకి తిరగబడటం తో వాటిని అదుపు చేసేందుకు యువత పోటీ పడ్డారు పండుగలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు



Body:ytr


Conclusion:hgf

ABOUT THE AUTHOR

...view details