ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lovers Suicide: అద్దంకిలో ప్రేమజంట ఆత్మహత్య

By

Published : Nov 15, 2022, 4:38 PM IST

Lovers commit suicide in Bapatla District: అద్దంకిలో ప్రేమ జంట ఆత్మహత్య, కలకలం రేపింది. చెట్టుకు ఉరివేసుకుని ప్రేమికులు ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పట్టణంలోని బాతుల పెద్దిరాజు, పాలపోతు ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Lovers  suicide
ప్రేమజంట ఆత్మహత్య

Lovers commit suicide in AP: బాపట్ల జిల్లా అద్దంకిలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అద్దంకి - రేణింగవరం వెళ్ళే రోడ్డు దగ్గరలో కాకాని వారి కుంట వద్ద చింత చెట్టుకు ఉరివేసుకుని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు పట్టణంలోని బాతుల పెద్దిరాజు(22), పాలపోతు ప్రశాంతి(20)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా.. సంఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి వరకు ఫోన్​లో అందుబాటులో ఉన్నారని.. తెల్లారేసరికి ఇలా చూస్తామనుకులేదని ఇరువురి తల్లిదండ్రులు వాపోయారు. ప్రేమికుల మృతదేహాలను పంచనామా కోసం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details