ETV Bharat / state

సూపర్​స్టార్ కృష్ణ మృతిపై ప్రముఖుల సంతాపం

author img

By

Published : Nov 15, 2022, 8:51 AM IST

Updated : Nov 15, 2022, 9:25 AM IST

CONDOLE THE DEATH OF SUPERSTAR KRISHNA: సూపర్​స్టార్​ కృష్ణ మరణం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, తెదేపా అధినేత చంద్రబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. 350కి పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.

Krishna condolence personalities
కృష్ణ మృతిపై ప్రముఖుల సంతాపం

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌: కృష్ణ మరణం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాపం ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా... తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి.. సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి... సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్‌స్టార్‌ కుటుంబసభ్యులకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌: సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్‌ సంతాపం ప్రకటించారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లూరి సీతారామరాజు పాత్రతో చిరస్థాయిగా నిలిచిపోయారని వెల్లడించారు. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్ అని తెలిపారు. నిజ జీవితంలోనూ మనసున్న మనిషి కృష్ణ అంటూ పేర్కొన్నారు. కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి, తెలుగువారికి తీరని లోటు వెల్లడించారు. కష్ట సమయంలో కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు.

వెంకయ్యనాయుడు: కృష్ణ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం అని పేర్కొన్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్​: అభిమానులు సూపర్​స్టార్​గా పిలుచుకునే ఘట్టమనేని కృష్ణ కన్నుమూతపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు: సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణ చేసిన కృషిని ప్రస్తావించారు. కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసినట్లందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోవడం మహేశ్‌కు తీరని వేదనేనని.. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యం ఆయన కుటుంబీకులకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్: కృష్ణ తుదిశ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించిందని పవన్‌ కల్యాణ్ అన్నారు. చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి ఆయన సార్థకత చేకూర్చారని అభిప్రాయపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయాలని పవన్‌ వ్యాఖ్యానించారు. జనసేన తరుపున తన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పవన్ వెల్లడించారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీరంగంలో సంచలనాత్మక మార్పులకు కృష్ణ ఆద్యుడని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు:

నారా లోకేశ్‌: సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నారా లోకేశ్‌ సంతాపం తెలియ జేశారు. విభిన్న పాత్రలతో ఆయన అనేక ప్రయోగాలు చేశారని పేర్కొన్నారు. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యం ఆయన కుటుంబీకులకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌: కృష్ణ మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌ సంతాపం తెలిపారు. ఏలూరు నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రజలకు మరిన్ని సేవలందించారని పేర్కొన్నారు. శైలజానాథ్‌ కృష్ణ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 15, 2022, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.