ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీలో వర్గపోరుకు వేదికైన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు- నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అలజడిలో అధికార పార్టీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 9:48 PM IST

Internal Differences Between YCP Leaders: వైసీపీలో ఎన్నాళ్లగానో ఉన్న వర్గ విభేదాలు సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలలో ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, మరోవైపు ఇన్‌ఛార్జిల మార్పు నేపథ్యంలో సీఎం జన్మదిన వేడుకలు అధికార పార్టీలో అలజడికి కారణమయ్యాయి.

Internal_Differences_Between_YCP_Leaders
Internal_Differences_Between_YCP_Leaders

Internal Differences Between YCP Leaders: ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు (CM Jagan Birthday Celebrations) వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరుకు ఆజ్యం పోశాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు నేపథ్యంలో ఎవరికి వారు తమ బలం చూపించుకునేందుకు పోటీపడ్డారు. పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే గాక, ప్రత్యర్థుల ఫ్లెక్సీలు తొలగించడం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీలో అలజడి రేగింది.

Differences between YCP Leaders in Alur constituency: కర్నూలు జిల్లా ఆలూరులో అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం, ఆస్పరి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షి వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల మార్పుపై అధినేత దృష్టి సారించిన నేపథ్యంలో గుమ్మనూరుకు ఈసారి టికెట్‌ లేదని, విరూపాక్షిని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించినట్లు ప్రచారం సాగుతోంది.

'కేకును నేలకేసి కొట్టి' మంత్రి Vs జడ్పీటీసీ - సీఎం జగన్ పుట్టిన రోజున భగ్గుమన్న వర్గ విభేదాలు

దీంతో అధినేత వద్ద తమ బలం చూపించుకునేందుకు ఇరువర్గాలు పోటీపడ్డాయి. ఆస్పరిలో కేక్ కట్ చేసేందుకు మంత్రి కుమారుడు ఈశ్వర్, సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి వచ్చారు. దీంతో అక్కడే ఉన్న విరూపాక్షి ఫ్లెక్సీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అనుచరులు ఆ ఫ్లెక్సీలను చించేశారు. ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న విలేకరిపైనా దాడికి పాల్పడ్డారు. జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు కేక్‌ తీసుకుని వెళ్తున్న చిప్పగిరి సర్పంచ్‌ వెంకటేశ్‌ను అడ్డుకుని మంత్రి అనుచరులు దాడికి యత్నించారు. కేక్‌ను నేలకేసి కొట్టారు. దీనిపై విరూపాక్షి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Internal Disputes in Bapatla District YSRCP: బాపట్ల జిల్లా అద్దంకిలోనూ వైసీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇటీవలే అక్కడ ఇన్‌ఛార్జిని మార్చడంతో రెండువర్గాలు పోటాపోటీగా జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించాయి. ఆర్ అండ్ బీ బంగ్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి హనిమిరెడ్డి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణచైతన్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఇద్దరూ తమకే టికెట్‌ ఖాయమంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

మరోసారి తెరపైకి అసమ్మతి రాగం - వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా కౌన్సిలర్ల సమావేశం

Differences Between Srikakulam YCP Leaders: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు వర్గాలు వేర్వేరుగా జన్మదిన వేడుకలు నిర్వహించాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూర్మినాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కైలే అనిల్‌తోపాటు టిక్కెట్ ఆశిస్తున్న ధనరాజుపల్లి శ్రీనివాసరావు వేర్వేరుగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు - పోటాపోటీ సమావేశాల్లో మాటల యుద్ధం

వైసీపీలో వర్గపోరుకు వేదికైన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details