ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM

By

Published : Nov 16, 2022, 7:02 PM IST

..

AP TOP NEWS
AP TOP NEWS

  • ముఖ్యమంత్రి జగన్​ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రానికి మంచి : చంద్రబాబు
    తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్​ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని నమ్మి.. ప్రజలు మోసపోయారని తెలిపారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కోడుమూరులోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట.. ఇంటి వద్దే విచారణకు ఆదేశం
    మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్​ నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీమంత్రి నారాయణపై సీఐడి కేసు నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్పీళ్లలో జోక్యం చేసుకోలేం.. రైతు సంఘాల అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు
    అమరావతి రైతుల పాదయాత్రలో నడిచేందుకు హైకోర్టును అనుమతి కోరిన రైతు సంఘాలకు చుక్కెదురైంది. రైతుసంఘాల అప్పీళ్లలో జోక్యానికి నిరాకరించిన సీజే నేతృత్వంలోని బెంచ్‌.. వారు దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "పులివెందుల ప్రజలు జగన్​కు ఎందుకు ఓటు వేయాలి"
    Tulasi Reddy: మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95శాతం అమలు చేశామని.. కాబట్టి 175 సీట్లకు గాను 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వేగంగా వెళ్తున్న ఆటో నుంచి దూకిన యువతి.. డ్రైవర్​ వేధింపులే కారణం!
    మహారాష్ట్ర ఔరంగాబాద్​లో ఓ యువతి వేగంగా వెళుతున్న ఆటో నుంచి బయటకు దూకింది. డ్రైవర్‌ ప్రవర్తనతో భయపడ్డ యువతి ఇలా చేసింది. మరోవైపు.. ర్యాపిడో రైడర్​ లైంగికంగా వేధించాడంటూ ఓ మోడల్ చేసిన ఫిర్యాదు అవాస్తమని తేల్చారు బెంగళూరు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏనుగు దెబ్బకు అడవిలో 8 కిలోమీటర్లు రివర్స్ గేర్​లో బస్సు ప్రయాణం
    కేరళ త్రిస్సూర్​ జిల్లాలోని అటవీ మార్గంలో ఓ బస్సు డ్రైవర్​ 8 కిలోమీటర్లు మేర బస్సును రివర్స్​ గేర్​లో నడిపాడు. మంగళవారం చలకుడిలోని వాల్‌పరై అటవీ మార్గంలో ఓ ఏనుగు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్​ బస్సును వెంబడించింది. ఏనుగు బారి నుంచి ప్రయాణికులను కాపాడేందుకు డ్రైవర్​ బస్సును రివర్స్​ గేర్​లో నడిపాడు. కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని చెప్పాడు డ్రైవర్. ఇది మరిచిపోలేని అనుభవమని అన్నాడు. అటవీ మార్గం అయినందున వేరే అవకాశం లేక అలా చేసినట్లు బస్సు డ్రైవర్​ తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోదీ మాటకు జైకొట్టిన 'జీ20'.. యుద్ధం ఆపాలని రష్యాకు పిలుపు
    ప్రస్తుత యుగం యుద్ధాలకు కాదని జీ20 దేశాలు ఉద్ఘాటించాయి. యుద్ధాన్ని ఆపాలని రష్యాకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిబింబించేలా ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​లోనే అతి చౌకైన ఎలక్ట్రిక్​ కారు ఇదే! ధర, ఫీచర్స్ చూశారా?
    అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్​ కారు కొనాలనుకునే వారికి గుడ్​ న్యూస్​! ముంబయికి చెందిన ఓ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ రూ.5 లక్షలలోపే ఓ కారును తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ కారు ముందస్తు బుకింగ్​లు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హార్దిక్​-కేన్​ విలియమ్స్​ రిక్షా సవారీ... వీడియో వైరల్​
    టీ20 ప్రపంచకప్​లో ఓటమి తర్వాత​.. కివీస్​తో తలపడేందుకు సిద్ధమైంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలోతాజాగా ఇరు జట్ల కెప్టెన్లు కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. రోడ్లపై రిక్షా సవారీ చేస్తూ కనిపించారు. ఆ వీడియో చూసేయండి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాధలోనూ ఫ్యాన్స్​పై ప్రేమ చూపించిన మహేశ్‌
    తమ అభిమాన నటుడు కృష్ణను కడసారి చూసేందుకు దూర ప్రాంతాల నుంచి అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా మహేశ్ బాబు తగిన ఏర్పాట్లు చేశారు. ఎవరూ ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details