ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bike Accident : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు యువకులు మృతి..

By

Published : Feb 15, 2022, 8:46 AM IST

Bike Accident : ఆ యువకులు ముగ్గురూ.. ఉపాధిని వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటి వచ్చారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబానికి ఆసరాహా నిలబడిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో వారు అక్కడికక్కడే ఊపిరి వదిలారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా రాగన్నగారిపల్లి సమీపంలో జాతీయరహదారి 42పై చోటు చేసుకుంది.

Bike Accident
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ...ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి...

Bike Accident : ఉపాధిని వెతుక్కుంటూ ఊరుకానీ ఊరు వచ్చిన ఆముగ్గురు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువ కబళించింది. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం రాగన్నగారిపల్లి సమీపంలో జాతీయరహదారి 42పై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు.

మృతుల వివరాలు...

తమిళనాడుకు చెందిన వెంకటేష్, రవి అనే ఇద్దరు మిత్రులు ఉద్యోగం కోసం అనంతపురం జిల్లాలోని కదిరికి వచ్చారు. మంజునాథఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగాలను సంపాదించారు. కదిరి పరిసరాల్లో ఫైనాన్స్ ద్వారా రుణాలు ఇస్తూ వాటి వాయిదాలను వసూలు చేసే ఉద్యోగాన్ని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తమఖర్చులకు పోనూ కుటుంబానికి డబ్బులు పంపుతూ ఉండేవారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన తస్లీంఆరిఫ్ కదిరిలో నివాసం ఉంటూ నల్లచెరువులోని బీరువాల కంపెనీలు పనిచేసే వాడు.

ప్రమాదం జరిగిందిలా...!

సోమవారం రాత్రి తస్లీం ఆరిఫ్ కదిరి నుంచి నల్లచెరువుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అదే సమయంలో మదనపల్లె వైపు వాయిదాల వసూలు కోసం వెళ్లిన వెంకటేశ్, రవి కలిసి కదిరికి బైక్ పై బయలుదేరారు. వీరి ద్విచక్ర వాహనాలు రాగన్నగారిపల్లి అదుపు తప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు.

విషయం తెలుసుకున్న నల్లచెరువు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సీఐ మధు, డీఎస్పీ భవ్యకిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.

ఇదీ చదవండి :సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి..

ABOUT THE AUTHOR

...view details