ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Feb 23, 2023, 9:14 PM IST

Updated : Feb 24, 2023, 6:32 AM IST

Three people died due to electric shock : విద్యుత్ షాక్​తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు యువకుడు కాగా మరో ఇద్దరు చిన్నారులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని కాపర్లపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందగా.. కడపలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు.

విద్యుత్ ఘాతం
Electric shock

Three people died due to electric shock : ట్రాన్స్​కో అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. కడప శివారులోని ఖాదర్ గాని కొట్టాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శశాంక్ (12), మనోజ్(4) ఇంటిపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. గ్రామంలో తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.

బంధువులైన ఈ చిన్నారులు సరదాగా ఇంటిపైకి ఎక్కి ఆడుకుంటుండంగా.. తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటాన్ని గమనించని చిన్నారులు... ప్రమాదవశాత్తు వాటిని తాకడంతో విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్​కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ పిల్లల ప్రాణాలు పోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని కాపర్లపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందాడు. కాపర్లపల్లి గ్రామానికి చెందిన గొల్ల మల్లప్ప అనే వ్యక్తి అదే గ్రామంలో ట్రాన్స్​ఫార్మర్​లో ఫ్యూజు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. నల్లప్ప ట్రాన్స్​ఫార్మర్​ ఎక్కి ఫ్యూజు వేస్తున్న సమయంలో విద్యుత్​ రావటంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనతో మల్లప్ప కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు పోలీసులకు తెలిపినట్లు రైతులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు నల్లప్ప మృతదేహాన్ని కిందికి దింపి పోస్ట్​మార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 24, 2023, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details