ఆంధ్రప్రదేశ్

andhra pradesh

State Health Director at Belodu: కలుషిత నీరే కారణం.. వెల్లడించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్​

By

Published : May 13, 2023, 12:09 PM IST

State Health Director at Belodu Village

State Health Director at Belodu Village: గుమ్మఘట్ట మండలం బేలోడులో 33 మందికి వాంతులు, విరేచనాలు కావడానికి ప్రధాన కారణం కలుషిత తాగునీరే అని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరక్టర్‌ వి.రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం బెలోడు గ్రామాన్ని అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.

State Health Director at Belodu Village: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామాన్ని శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి సందర్శించారు. అనంతపురం డీఎంహెచ్​ఓ వీరబ్బాయితో కలిసి అనంతపురం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. బేలోడు గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి వారు పర్యటించారు.

గ్రామంలో తాగునీటి పైప్ లైను, కుళాయిలు నేలమట్టం కంటే కింది భాగంలో ఉండటం వల్ల గుంతల్లో నిలిచిన నీరు పైపుల్లోకి వెళ్లి ఉంటుందని.. అందువల్ల తాగునీరు కలుషితమైనట్లు వెల్లడించారు. తాగునీటి పైపుల్లో నీరు కలుషితం కావడం వల్ల గ్రామంలో డయేరియా వ్యాధి వ్యాపించి 33 మంది వాంతులు, విరేచనాలతో రాయదుర్గం, అనంతపురం, కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు.

గ్రామంలో గ్రామ పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సంపూర్ణ పారిశుధ్య చేపట్టి సురక్షితమైన తాగునీరు సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తాగునీరు కలుషితం కాదని, ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వెల్లడించడం తమను పక్కదారి పట్టించేదిగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.

గ్రామంలో సురక్షితమైన మంచి నీరు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని వారు కోరుతున్నారు. బీసీ కాలనీలోని కిందివీధిలో కుళాయిల చుట్టూ నెలకొన్న అపరిశుభ్రతతోపాటు నీరు కలుషితమై ఉండవచ్చని రెండు రోజులుగా ‘ఈనాడు’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. రెండు రోజులుగా ఈటీవీ భారత్​లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అధికారులు కారణాలు గుర్తించకపోవడంతో ఒకరు మృతి చెందారు. పలువురు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. దీంతో స్టేట్​ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి వెంట డీఎంహెచ్‌ఓ వీరబ్బాయి, సహాయ డీఎంహెచ్‌ఓ సుజాత, డీఐఓ యుగంధర్‌, ఈహెచ్‌ రామిరెడ్డి, డెమో భారతి, హెచ్‌ఈ వేణు ఉన్నారు.

సెల్‌ఫోన్‌ వెలుతురులో ఆరా.. శుక్రవారం రాత్రి రాయదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎపిడమాలజిస్టు వెంకటేశ్వర్లు పరామర్శించారు. వైద్యులకు సూచిస్తుండగా విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. మూడు గదులకు కలిపి ఉన్న యూపీఎస్‌ సామర్థ్యం చాలకపోవడంతో సెల్‌ఫోన్‌ వెలుతురులో పరిశీలించారు. జనరేటర్‌ లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details