ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SNAKES: పాముల కలకలం... ఒకటి కాదు రెండు కాదు..

By

Published : Sep 14, 2021, 8:17 PM IST

పాములంటే అందరికీ భయం.. దానిని చూడగానే చాలామంది పరుగులు తీస్తారు. ఎక్కడైనా పాము కనిపిస్తే..కొంతమంది అటువైపు వెళ్లడమే మానేస్తారు. ఇక అటువైపు వెళ్తే భయం భయంగానే నడుచుకుంటూ.. దిక్కులు చూసుకుంటూ వెళ్తారు. ఒక్క పామును చూస్తేనే ఇలా వుంటే గుంపులు గుంపులుగా పాములు కనిపిస్తే పరిస్థితి ఏంటి?

పాముల కలకలం
పాముల కలకలం

అనంతపురం జిల్లాలో కలకలం రేపిన పాముల గుంపు

చీమలు గుంపులు గుంపులుగా వరుస క్రమంలో ఆహార అన్వేషణ కోసం రావడం చూస్తాం.. కానీ అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుర్రబ్బాడులోని ఓ పొలంలో ఏకంగా డెబ్భై నుండి ఎనభై పాములను పొలం యజమాని గుర్తించాడు.

గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు పొలంలో క్రిమి సంహారక మందు పిచికారీ చేసి.. వరి మళ్లలో నీళ్లు నింపాడు. రెండు రోజుల తర్వాత పొలం వద్దకు వెళ్లి చూడగా వరిమడిలో కొన్ని పాములు చనిపోయి నీటిలో తేలుతూ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన రామాంజనేయులు ఇంకా ఏమైనా పాములు ఉన్నాయేమోనన్న అనుమానంతో మడిలోని నీటిని బయటకు పంపించి చూడగా.. మరికొన్ని పాములున్నట్లు గుర్తించాడు. పొలంలో అడుగుపెడితే ఎక్కడ కాటువేస్తాయోనని భయపడ్డాడు. మొత్తానికి అన్ని పాములను బయటకు తీసి హతమార్చాడు.

ఇదీ చదవండి:

EAPCET: అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details