ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాగునీటికి రోడ్డెక్కిన ప్రజలు.. గంటపాటు స్తంభించిన రాకపోకలు

By

Published : Feb 9, 2023, 12:25 PM IST

Protests on Bellary main road: నీటి సమస్యను పరిష్కరించాలంటూ అనంతపురంలో ఖాళీ బిందెలతో రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులెవరూ తమ బాధల్ని పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే.. నాలుగేళ్లు గడిచినా కన్నెత్తి చూడడం లేదంటూ కాలనీవాసులు మండిపడ్డారు..

Protests on Bellary main road
Protests on Bellary main road

తాగునీటికి రోడ్డెక్కిన ప్రజలు.. గంటపాటు స్తంభించిన రాకపోకలు

Protests on Bellary main road: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు వాల్మీకి నగర్​కి చెందిన కాలనీ వాసులు ఖాళీ బిందెలతో పట్టణంలోని బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో గంటకుపైగా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్నికల సమయంలో కాలనీలో అభివృద్ధి పనులు చేపడతామని తమకు ఓట్లు వేసి గెలిపిస్తే కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని.. హామీ ఇచ్చి గెలుపొంది.. 4 సంవత్సరాలు అవుతున్నా.. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాలనీ వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదంటూ.. కాలనీవాసులు మండిపడ్డారు.

తమను ఓటర్లుగానే గుర్తిస్తున్నారు తప్ప కాలనీలోని సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో కుళాయిలు, వీధిలైట్లు, రహదారులు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని పలుమార్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వార్డ్ కౌన్సిలర్ దేవరాజుకు మొరపెట్టుకున్న సమస్య పరిష్కరించ లేదన్నారు. త్రాగునీటి కోసం బిందెలు తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లి నీరు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొందన్నారు.

వీధిలైట్లు లేక రాత్రి వేళల్లో విషపురుగులు సంచరిస్తున్నాయని బిక్కి బిక్కి మంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రతుకుతున్నామన్నారు. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, ఎస్సై వై సుమన్, పోలీసులు అక్కడికి చేరుకొని రస్తారోకో చేస్తున్న ప్రజలకు నచ్చ చెప్పి విరమింప చేశారు. ఆందోళన చేస్తున్న కాలనీవాసులను మున్సిపల్ కార్యాలయానికి ఆటోలలో తీసుకెళ్లి చర్చలు జరిపారు.

తాగునీటి ఎద్దడి తీర్చాలని కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్​కు విన్నవించారు పిలుచుకు వెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ వద్ద ఏకరువు పెట్టారు. ట్యాంకర్ ద్వారా వాల్మీకి నగర్​కు తాగునీరు అందిస్తామని మున్సిపల్ కమిషనర్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details