ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎంపీ తలారి వచ్చారని.. తమ ఇళ్ళ నిర్మాణాల ఆపేందుకు మంత్రి ఆదేశాలిచ్చారన్న బాధితులు

By

Published : Jan 21, 2023, 10:28 PM IST

మంత్రి ఉషశ్రీ చరణ్ పై సొంత నియోజకవర్గంలోని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత పార్టీ ఎంపీని ఆహ్వానించడం నచ్చని మంత్రి.. తమ ఇళ్ళ నిర్మాణం ఆపేందుకు ఆదేశాలిచ్చిందని వారు మండిపడ్డారు. ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా మంత్రే, అధికార్లకు ఆదేశాలు ఇచ్చిందని.. వారు నిరసనకు దిగారు.

Anantapur Distric
అనంతపురం వైసీపీలో అంతర్గత పోరు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధికారి పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఒంటిమిది గ్రామానికి కొద్ది రోజుల క్రితం అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎర్రిస్వామి అనే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఎంపీ తన ఇంటికి రావడం మంత్రి ఉషచరణ్ శ్రీ కి ఇష్టం లేదని.. దీంతో, నిర్మాణంలో ఉన్న తన ఇంటిని ఆపేందుకు ఆదేశాలిచ్చిందని బాధితుడు ఎర్రిస్వామి ఆరోపించారు. తన ఇంటికి మున్సిపల్ కమిషనర్ వచ్చి, అనుమతి పత్రాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాడని, గట్టిగా అడిగితే.. పై నుంచి వచ్చిన వత్తిడి వల్లే ఇది జరుగుతుందన్నట్లు పేర్కొన్నాడని మండిపడ్డారు. కమిషనర్ వైఖరిని నిరసిస్తూ..ఆయన రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

''ఒంటిమిది గ్రామంలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను. మా ఇంటికి మున్సిపల్ కమిషనర్ వచ్చి ఇంటి సర్వే చేశారు. ఎందుకు సార్ సర్వే చేస్తున్నారని అడిగాను. నియోజకవర్గాలో చాలా ఇళ్లు ఉన్నాయి కదా, అవన్నీ కాదని నాది మాత్రమే ఎందుకు సర్వే చేస్తున్నారని అని అడిగాను. దానికి ఆయన పైనుంచి తనపై చాలా ఒత్తిళ్లు వస్తున్నాయని.. అందుకే ఇక్కడ మాత్రమే సర్వే చేస్తున్నానని అన్నారు. "

" ఎంపీ తలారి రంగయ్య మా ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్లారు. అప్పటి నుంచి మాకు ఈ సమస్య మొదలైంది. ఆయన రాకపోయుంటే ఈ సమస్య వచ్చింది కాదు మాకు. మేము వైసీపీనే.. వాళ్లు వైసీపీనే ఏం చేయాలి అలా ఉంది మా కర్మ. అయినా కూడా పార్టీలోనే కొనసాగుతున్నాం. '' భాదితుడు ఎర్రిస్వామి

అనంతపురం వైసీపీలో అంతర్గత పోరు.. మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details