ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అర్హులందరికీ ఆర్థిక సాయం చేయండి'

By

Published : Jun 8, 2020, 6:27 PM IST

శింగనమల మండల ప్రజా పరిషత్ కార్యలయం వద్ద సీపిఐ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చేతివృత్తిదారులకు ఆర్థిక సాయం అర్హులైన వారందిరికీ అందజేయాలని డిమాండ్ చేశారు.

ananthapuram district
'చేతి వృత్తి దారులైన అర్హులకు ఆర్థీక సాయం చేయండి'

అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో సీపీఐ నేత చెన్నప్ప యాదవ్ ఆద్వర్యంలో ఎంపీడీవో ఆఫీసు వద్ద ధర్నా చేపట్టారు. అర్హులైన వారందరికీ చేతివృత్తిదారులకు రూ. 10 వేల ఆర్ధిక సాయం పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పథకాల్లో అనర్హులకు స్థానిక నేతలు చోటు కల్పించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కులం, మతం ప్రాంతం చూడబోమని చెబుతూనే నిరు పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు వాపోయారు. ఇప్పటికైన అర్హులను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇది చదవండిరాష్ట్రంలో కొత్తగా 154 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details