ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కెనడాలో అనంత యువకుడి ఆత్మహత్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

By

Published : Nov 23, 2020, 10:05 PM IST

కెనడాలో అనంతపురం యువకుడు ఆత్మహత్యపై మృతుని బంధువులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వాళ్లు తెలిపారు.

complaint to anantapur sp on  suicide case
కెనడాలో అనంతపురం యువకుడి ఆత్మహత్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

ప్రియురాలు మోసం చేసిందనే నెపంతో కెనడాలో ఆత్మహత్య చేసుకున్న అనంతపురం యువకుని బంధువులు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రణయ్ ఆత్మహత్యకు సంబంధించిన కారణాలను ఎస్పీకి సమర్పించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. కెనడా పోలీసులతో చర్చించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని మృతుని తల్లి వాణి అన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details