ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అగ్నిమాపక వారోత్సవాలు.. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ప్రదర్శనలు

By

Published : Apr 15, 2021, 10:58 PM IST

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా... రాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను విన్యాసాల రూపంలో ప్రదర్శించారు.

awareness-programs-on-fire-accidents-in-andhrapradhesh
రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు

అనంతపురం జిల్లాలో...

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఫైర్ ఆఫీసర్ అశ్వర్థ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న డీ-మార్ట్ వద్ద అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మంటలు ఎగసిపడుతున్న సమయంలో వాటిని ఎలా అదుపు చేయాలి?, ప్రమాదాల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలి? అనే అంశాలపై పలు సూచనలు చేశారు.

పెనుకొండలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరిగిన వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సిబ్బంది సూచించారు.

విశాఖపట్నం జిల్లాలో...

విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే దానిని ఎలా అదుపు చేయాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కలిగించారు.

శ్రీకాకుళం జిల్లాలో...

పాలకొండలో అగ్నిమాపక శాఖ అధికారి గోవిందు ఆధ్వర్యంలో... అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. పట్టణంలోని కార్గిల్ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అగ్ని ప్రమాద సమయాల్లో ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై విన్యాసాలు రూపంలో అవగాహన కలిగించారు.

ఇదీ చదవండి:

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపేశాడు

ABOUT THE AUTHOR

...view details