ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనకాపల్లిలో విషాదం.. కాలువలో అక్కాచెల్లెలు గల్లంతు

By

Published : Jun 18, 2022, 2:17 PM IST

Sisters accidently fall into Yeleru Canal: దుస్తులు ఉతకటానికి వెళ్లి అక్కాచెల్లెలు గల్లంతైన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. వీరిలో ఒకరి మృతదేహం వెలికితీయగా మరొకరి కోసం గాలిస్తున్నారు.

గల్లంతు
గల్లంతు

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో విషాదం నెలకొంది. దుస్తులు ఉతకడానికి ఏలేరు కాలువ వద్దకు అక్కాచెల్లెలు వెళ్లారు. దుస్తులు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి.. పడాల తిరుమల(18), పడాల యమున(12) నీటిలో గల్లంతయ్యారు. వీరిలో అక్క పడాల తిరుమల మృతదేహాన్ని వెలికితీయగా.. చెల్లెలు పడాల యమున కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:బాలయ్య-చరణ్​-విజయ్..​ దేనికి జై కొడతారో?

ABOUT THE AUTHOR

...view details