నరసరావుపేట పోలీసుల అదుపులో.. సికింద్రాబాద్ 'అగ్నిపథ్‌' అల్లర్ల సూత్రధారి..!

author img

By

Published : Jun 18, 2022, 10:34 AM IST

Updated : Jun 18, 2022, 1:09 PM IST

subbarao

10:27 June 18

సుబ్బారావు పాత్రపై పోలీసుల అనుమానం

వాట్సప్​ చాటింగ్​
వాట్సప్​ చాటింగ్​

secunderabad agitations accused arrested : అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. నిన్న జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో సుబ్బారావుకు ప్రమేయం ఉందా.. లేదా అనే కోణంలో పోలీసులు గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకుని.. రెండో పట్టణ పోలీసుస్టేషన్​కు తరలించినట్లు నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. అతన్ని అరెస్ట్​ చేయలేదని వెల్లడించారు.

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మంది యువకులు ప్రధాన కారకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సాప్‌ గ్రూపుల్లో యువతను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ బ్లాక్స్‌, 17/6 గ్రూప్‌తో పాటు పలు పేర్లతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అల్లర్లకు సంబంధించి ఆందోళనకారుల వాట్సప్‌ సందేశాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సబ్బారావు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దీంతో సుబ్బారావును ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన స్టార్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు వసీంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated :Jun 18, 2022, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.