ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్టీఆర్​ జిల్లాలో బైక్​ను ఢీకొట్టిన టిప్పర్​ - ముగ్గురు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 11:02 PM IST

Accident in Rajampeta RTC Bus Stand: రాష్ట్రంలో వేేర్వేరు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఓ టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు అరకు నుంచి వంజంగి కొండలను చూసేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనం భారీ వాహనాన్ని ఢీకొనింది.ఈ ప్రమాదంలో వాసు, రవితేజ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు ఎక్కడికక్కడ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road accidents
road accidents

Accidents in Andhra Pradesh:ఎన్టీఆర్ జిల్లాలో ఓ టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వివరాలు తెలియాల్సి ఉందిఅన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి బస్సు కింద పడి చనిపోయాడు. రాత్రి సమయంలో ఈ సంఘటన జరగడంతో ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు తెలియలేదు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ మద్దయ్య ఆచారి, ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలు తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు- పూర్తిగా దగ్ధమైన వాహనం

Road accident in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా సమీపంలోని కురిడి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు పర్యాటకులు ప్రమాదానికి గురై మృతి చెందారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం సామంత వలస గ్రామానికి చెందిన ఆరుగురు మిత్రులు అరకు అందాలను తిలకించేందుకు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. అరకు నుంచి వంజంగి కొండలను చూసేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనం భారీ వాహనాన్ని ఢీకొనింది. ఈ ప్రమాదంలో వాసు, రవితేజ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. విహారానికి వచ్చి ఆనందంగా గడుపుదాం అన్న తరుణంలో ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

ప్రైవేటు బస్సు ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతి - పరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై ఆందోళన

Road accident in kopperapadu: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరప్పాడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ట్రాక్టర్ కట్టెల లోడుతో అద్దంకి వైపు వెళుతుండగా కొప్పెరప్పాడు గ్రామ శివారు వద్ద వెనుక నుంచి వస్తున్న కారు ట్రాక్టర్​ను బలంగా ఢీకొట్టడంతో కారు యజమాని అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ ప్రక్కన ఉన్న వ్యక్తి ట్రాక్టర్ పైనుంచి కింద పడి మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన తెలిపారు.

ట్రాక్టర్​ను ఢీకొట్టిన కారు - ఇద్దరు మృతి 'బస్సుకింద పడి మరొకరు'

Road accident in Srikakulam:శ్రీకాకుళంలో వరి నూర్పిడి యంత్రం నుంచి కింద పడి దంపతులు మృతి చెందారు. మందస మండలం భిన్నలమదనాపురం వద్ద నూర్పిడి యంత్రం బోల్తా పడింది. నూర్పిడి యంత్రం కింద చిక్కుకుని దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఎమ్మెల్యే వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు - ఆసుపత్రికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details