ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉపాధి పేరిట మోసం, విదేశాల్లో చిక్కుకున్న యువకులు

By

Published : Aug 19, 2022, 11:00 PM IST

YOUTH TRAPPED BY BROKERS
YOUTH TRAPPED BY BROKERS ()

YOUTH TRAPPED BY BROKERS బతుకుదెరువు చూపిస్తామంటూ గల్ఫ్‌కు వెళ్లిన 8 మంది రాష్ట్రవాసులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెల్డింగ్‌ పనిపేరిట తమను దళారులు ఒమన్‌ తీసుకొచ్చారని అన్నారు. తీసుకు వచ్చిన తర్వాత కనీసం తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

YOUTH TRAPPED BY BROKERS: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలలాకు చెందిన 8మంది యువకులు.. ఒమన్‌లో చిక్కుకుపోయారు. కల్గి నాయుడు, వాసెట్టి రవికుమార్‌, గుణ్ణా గోపాల్‌, సీలా వాసుదేవ్‌, తామాడ కృష్ణరావు, కీలు మాణిక్యరావు, కర్ని లోకనాథం, తలగాన నీలకంఠం అనే వ్యక్తులు.. ఈ ఏడాది మే నెలలో విశాఖలోని కార్తికేయ ఇనిస్టిట్యూట్‌ ద్వారా ఉపాధి నిమిత్తం వీరు ఒమన్‌ దేశం వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్‌ పనులు ఉంటాయని దళారులు చెప్పడంతో సొమ్ము చెల్లించి ఇక్కడకు వచ్చామన్నారు.

అయితే సంబంధిత దళారులు చెప్పిన కంపెనీ అక్కడ లేదని, ఒంటెలకు కాపలాదారుగా వదిలివేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఉపాధి, తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్టు , వీసాలు నకిలీ పోలీసులు తీసుకోవడంతో భారత రాయబార కార్యాలయానికి సంప్రదించే అవకాశం లేదని బాధితులు తెలిపారు. తమను కాపాడి స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్‌తో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌కు వీడియోలో విజ్ఞప్తి చేశారు.

ఒమన్‌లో చిక్కుకుపోయిన 8 మంది సిక్కోలు వాసులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details