ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ జిల్లాలో అక్కాచెల్లెలు అదృశ్యం..

By

Published : Mar 19, 2021, 7:56 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో అక్కాచెల్లెలు అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

irls missing at Mamidipalli village
విశాఖ జిల్లాలో అక్కాచెల్లెలు అదృశ్యం

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెలు అదృశ్యమయ్యారు. ఆ యువతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మామిడిపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెల్లు ఫిబ్రవరి 15న ఇంటినుంచి వెళ్లిపోయారు. వాళ్ల కోసం సమీప ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని ఆ యువతుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ దేవరాపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సింహాచలం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details