ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంతకల్లు రైల్వే జంక్షన్​లో దొంగలు స్వైరవిహారం.. రెండు రైళ్లలో చోరీ

By

Published : Jan 27, 2023, 9:00 PM IST

Jewelery theft at railway station: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ పరిధిలో రెండు రైళ్లలో దొంగలు రెచ్చిపోయారు.. కర్ణాటక, బీదర్ ఎక్స్​ప్రెస్ రైళ్లలో ఇద్దరు మహిళల వద్ద చైన్ స్నాచింగ్, మరో ప్రయాణికుడి వద్ద నగల బ్యాగ్ చోరీ చేశారు. ఈ మూడు ఘటనల్లో మొత్తం 29 తులాల బంగారు నగలను చోరీ చేశారు.. బాధితులు గుంతకల్లు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Jewelery theft at railway station
Jewelery theft at railway station

Jewelery theft at railway station: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్​లోనీ పలు రైళ్లల్లో దొంగలు రెచ్చిపోయారు. గుంతకల్లు పట్టణంలోని రైల్వే జంక్షన్ లో బీదర్, కర్ణాటక, ఎక్స్​ప్రెస్ రైళ్లలో భారీగా చోరీ జరిగింది. రైలు కదులుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల వద్ద నుండి బంగారు ఆభరణాలను లాక్కెళ్లగా.. మరో రైలులో ఓ వ్యక్తి వద్ద ఉన్న నగల బ్యాగును దొంగిలించి దొంగలు పారిపోయారు.

మొత్తం ముగ్గురు నుండి 29 తులాల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. తోటి ప్రయాణికుల సహాయంతో బాధితులు గుంతకల్లు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details