ETV Bharat / bharat

ఒంటరిగా నిద్రిస్తున్న చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. తట్టుకోలేక పోలీస్ స్టేషన్​కెళ్లి..

author img

By

Published : Jan 27, 2023, 5:06 PM IST

ఓ 18 ఏళ్ల యువతి తన సొంత అక్కపై ఫిర్యాదు చేసింది. తనను అక్క లైంగికంగా వేధిస్తోందని కేసు పెట్టింది. మరోవైపు గణతంత్ర దినోత్సవం రోజు ఓ మైనర్​పై గ్యాంగ్​ రేప్​నకు పాల్పడ్డారు కొందరు దండగులు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

elder sister molested younger sister
elder sister molested younger sister

సొంత అక్క తనను లైంగికంగా వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. మహారాష్ట్ర పుణె జిల్లాలో జనవరి 23న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. విమానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నివసిస్తున్నారు. 24 ఏళ్ల అక్క ఉన్నత విద్యావంతురాలు. ఆమెకు వివాహం కూడా అయింది. 18 ఏళ్ల చెల్లి.. గత కొద్ది రోజులుగా అక్కతో పాటు విమానగర్​ ప్రాంతంలో ఉంటోంది. జనవరి 23న చెల్లి హాలులో నిద్రిస్తోంది. అనంతరం అక్క అక్కడకు వచ్చి చెల్లిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టింది. ఇది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా వినలేదు. దీంతో పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన చెల్లి.. అక్క తనను లైంగిక వేధిస్తోందని ఫిర్యాదు చేసింది.

బాలికపై గ్యాంగ్​ రేప్​..
ఓ బాలికపై కొందరు దుండగులు గ్యాంగ్​రేప్​ చేశారు. గణంతంత్ర దినోత్సవం రోజు ఓ 14 ఏళ్ల విద్యార్థిని పాఠశాలకు వెళ్తుండగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన బిహార్​లోని బక్సర్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్రాల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బాలిక ఉంటోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె పాఠశాలకు వెళుతోంది. అది గమనించిన దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. నిర్జన ప్రదేశంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఆరోగ్యం క్షీణించడం వల్ల అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాలిక ఇంటికి చేరుకుని.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వారు మహిళా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మనీశ్​ కుమార్​ స్పందించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోషులను విడిచిపెట్టమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.