ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ATTACK: రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామని తెదేపా నేతకు బెదిరింపులు

By

Published : May 17, 2022, 10:04 AM IST

ATTACK: వైఎస్సార్ జిల్లా కమలాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలకు దూరం కాకుంటే చంపేస్తామంటూ కాగితాలపై రాసి... కారుకు అంటించారు. కారుకు పట్టిన గతే నీకూ పడుతుందంటు రాసిన కాగితాలను సాయినాథ్‌ శర్మ కారుకు, ఇంటి గోడలకు అంటించారు.

ATTACK
తెదేపా నేత సాయినాథ్‌ శర్మ కారు ధ్వంసం.. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామని బెదిరింపులు

తెదేపా నేత సాయినాథ్‌ శర్మ కారు ధ్వంసం.. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామని బెదిరింపులు

ATTACK: వైఎస్సార్ జిల్లా కమలాపురంలో దుండగులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే అంతుచూస్తామంటూ కారుకు బెదిరింపులు లేఖలు అంటించారు. రాజకీయాలకు దూరం కాకుంటే చంపేస్తామంటూ కాగితాలపై రాసి.. కారుకు అంటించారు. కారుకు పట్టిన గతే నీకూ పడుతుందంటు రాసిన కాగితాలను సాయినాథ్‌ శర్మ కారుకు, ఇంటి గోడలకు అతికించారు. కమలాపురంలో రామాపురం గుడి వద్ద కారు నిలిపి ఉండగా.. దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు.

రామాపురం క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఆలయంలోనే నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటాక కారును ధ్వంసం చేసినట్లు.. తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. దాడి ఘటనపై.. సాయినాథ్‌శర్మ ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రేపు కమలాపురంలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండగా.. ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా సాయినాథ్‌ శర్మ తెలుగుదేశం చేపడుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఎవరి బెదిరింపులకు భయపడము..తెదేపా నేత సాయినాథ్‌ శర్మ:ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి బెదిరింపులకు భయపడమని సాయినాథ్‌ శర్మ స్పష్టం చేశారు. రాజకీయాలు మానుకోవాలని లేఖలు పెట్టడం పిరికిపంద చర్య అని ఎద్దేవా చేశారు. రేపు చంద్రబాబు పర్యటన ఉండగా ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వాస్తవాలు వారే తేలుస్తారని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details