ETV Bharat / city

రెండున్నర ఏళ్లలో 2,112 మంది రైతుల ఆత్మహత్య.. నిర్ధారణ ప్రక్రియను గాలికొదిలేసిన యంత్రాంగం

author img

By

Published : May 17, 2022, 8:34 AM IST

Farmers Suicide
రెండున్నర ఏళ్లలో 2,112 మంది రైతుల ఆత్మహత్య

Farmers Suicide: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నిర్ధారణ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం గాలికొదిలేసిందని మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. 2019 జూన్‌ నుంచి 2021 చివరి వరకు (ఎస్‌సీఆర్‌బీ, డీసీఆర్‌బీ, వేదిక వాలంటీర్ల నుంచి అందిన వివరాలు) ఆంధ్రప్రదేశ్‌లో 2,112 మంది రైతులు (అత్యధికులు కౌలురైతులే) ఆత్మహత్య చేసుకోగా.. 718 కుటుంబాలకే జీవో 43 ప్రకారం ఆర్థిక సాయం అందిందని వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం అందించేందుకు జీవో 43 సరిగా అమలు కావడం లేదని తెలిపారు.

Farmers Suicide: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నిర్ధారణ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం గాలికొదిలేసిందని మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. 2019 జూన్‌ నుంచి 2021 చివరి వరకు (ఎస్‌సీఆర్‌బీ, డీసీఆర్‌బీ, వేదిక వాలంటీర్ల నుంచి అందిన వివరాలు) ఆంధ్రప్రదేశ్‌లో 2,112 మంది రైతులు (అత్యధికులు కౌలురైతులే) ఆత్మహత్య చేసుకోగా.. 718 కుటుంబాలకే జీవో 43 ప్రకారం ఆర్థిక సాయం అందిందని వివరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం అందించేందుకు జీవో 43 సరిగా అమలు కావడం లేదని తెలిపారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, బాధిత కుటుంబాల పరిస్థితిపై ఉభయ వేదికల ప్రతినిధి బృందాలు గత కొంతకాలంగా నిజనిర్ధారణ చేస్తున్నాయని, ఇందులో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో నాలుగు జిల్లాల్లోని 19 గ్రామాల్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న 22 మంది రైతుల కుటుంబాలు, అక్కడి గ్రామస్థులను కలుసుకున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, ప్రభుత్వ స్పందనపై వివరాలు తీసుకున్నట్లు తెలిపారు.

పర్యటించిన జిల్లాలు: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు పర్యటించారు. ఈ జిల్లాల్లోని మొత్తం 19 గ్రామాల్లో 22 రైతు కుటుంబాలను కలిశారు.

నిజ నిర్ధారణలో పాల్గొన్న ప్రతినిధులు: బి.కొండల్‌, జి.బాలు (రైతు స్వరాజ్యవేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు), జి.శివనాగేశ్వరరావు (మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు), వై.రాజేశ్‌ (మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి), కె.అనూరాధ, ఎం.బ్రహ్మయ్య (మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు), వీఎస్‌ కృష్ణ (మానవహక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త) పాల్గొన్నారు.

ప్రతినిధులు గుర్తించిన అంశాలు:

* ఆత్మహత్యకు పాల్పడిన వారిలో దాదాపు అందరూ కౌలు రైతులే.
* చేసిన అప్పు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు.
* జీవో 43 ప్రకారం వీరెవరికీ ఆర్థిక సాయం, పునరావాస ప్యాకేజీ అందలేదు. ఆర్డీవో, వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ), డీఎస్పీ గ్రామాలను సందర్శించలేదు. చాలా కేసుల్లో తహసీల్దారు, ఏఓ, ఎస్‌ఐతో కూడిన మండలస్థాయి కమిటీ ప్రాథమిక విచారణ జరిపి వివరాలు తీసుకోవడం లేదు.
* ఎక్కువ మంది మిర్చి, పత్తి సాగు చేస్తున్నవారే.
* ఎవరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) లేవు.
* బాధిత కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
* ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. వీరెవరికీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు అందలేదు.
* ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బి.చెర్లోపల్లిలో రైతు భరోసా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఇంట్లో మాదిరెడ్డి వెంకటనారాయణరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నా.. ఇంతవరకు పరిహారం అందలేదు.

Farmers Suicide
ప్రతినిధులు సందర్శించిన రైతు కుటుంబాల వివరాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.